33.7 C
India
Tuesday, May 14, 2024
More

    Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ..!

    Date:

    Telangana Congress
    Telangana Congress

    Telangana Congress : మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. మరి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుంది అని డౌట్ మీకు రావొచ్చు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు రానున్నాయో సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా తెలంగాణలో సౌత్‌ ఫస్ట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ట్రాకర్‌ పోల్‌ సర్వే చేసేంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలోని 17 ఎంపీల్లో కాంగ్రెస్ అత్యధికంగా గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.

    బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీ గతంలో లాగానే సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు 8 నుంచి 10 స్థానాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ 3 నుంచి 5 స్థానాలు, బీజేపీ 2 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అం చనా వేసింది. ఇతరులు ఒక స్థానంలో విజ యం సాధించవచ్చని పేర్కొంది. ఆదిలాబాద్‌, నిజామా బాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ బలంగా ఉన్నట్లు సర్వే సంస్థ పేర్కొంది.

    అదే సమయంలో ఇదే జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ కు పట్టు ఉంది. అయితే లోక్ సభ ఎన్నికల విష యానికి వచ్చేసరికి బీజేపీ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11 నుంచి 17వ తేదీ వరకు సౌత్‌ ఫస్ట్‌ వెబ్‌ సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఈ ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. ప్రధా న మంత్రి ఎవరయితే బాగుంటుందని అడిగిన ప్పు డు 34 శాతం మంది నరేంద్ర మోడీకే జై కొట్టినట్లు సర్వే వివరించింది.

    23 శాతం మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్య క్షుడు రాహుల్‌ గాంధీ రెండో స్థానంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గిన ముస్లిం లు.. లోక్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సర్వే సంస్థ అంచనా వేసింది. దాదాపు 52 శాతం ముస్లిం సామాజికవర్గం కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తుండగా, బీఆర్‌ఎస్‌కి 38 శాతం ముస్లింలు మాత్రమే మద్దతిస్తున్నారు. మహిళల్లో 42 శాతం, పురుషుల్లో 37 శాతం మంది కాంగ్రెస్‌కి మద్దతిస్తున్నారని పేర్కొంది.

    Share post:

    More like this
    Related

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    Gaza : గాజాలో ఐరాస వాహనంపై దాడి.. భారతీయుడి మృతి

    Gaza : గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి...

    Theatre-OTT : థియేటర్.. ఓటీటీ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయా?

    Theatre-OTT : ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

    New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం...