40.2 C
India
Sunday, May 19, 2024
More

    Snakebite : పాముకాటుకు విరుగుడు.. ఇక ఆ జంతువులకు ఏ బాధ ఉండదు!

    Date:

    Snakebite
    Snakebite

    Snakebite : వైద్యరంగంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నా..ఇప్పటికీ పాముకాటు మరణాలు తగ్గడం లేదు. గ్రామాల్లో ఇప్పటికీ పాముకాటుతో పలువురు మరణిస్తూనే ఉన్నారు. పాముకాటు కుట్టిందని తెలియకపోవడం, ఒక వేళ తెలిసినా పల్లె నుంచి దగ్గరలోని పట్టణం వచ్చేసరికి సమయం మీరిపోవడంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయి.  అడవులు, కొండలు, లోయ ప్రాంత జనాలకు ఈ కష్టాలు మరింత ఎక్కువ. ఒక్కోసారి హాస్పిటల్ కు సమయానికే తీసుకొచ్చిన పాముకాటు విరుగుడు మందు దొరకడం లేదు. ఇక ఇలాంటి చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

    పాముకాటుకు విరుగుడు కనిపెట్టడంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సీ)సైంటిస్టులు సఫలమయ్యారు. అమెరికాకు చెందిన స్కిప్స్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. హెచ్ ఐవీ, కొవిడ్-19 వైరస్ లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ఈ పరిశోధనకు ప్రాతిపదికగా నిలిచింది.

    తమ సింథటిక్ యాంటీబాడీ త్రాచుపాము, నాగుపాము(కింగ్ కోబ్రా), కట్లపాము, బ్లాక్ మాంబా వంటి పాముల విషాన్ని ఎదుర్కోగలదని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం గుర్రాలు, కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందులు తయారుచేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు హానికరంగా పరిణమిస్తోంది. తాజా పరిశోధన వల్ల ప్రయోగశాలలోనే సింథటిక్ యాంటీబాడీలను తయారుచేయడం వీలవుతోంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Super Star New Multiplex : సూపర్ స్టార్ న్యూ మల్టీప్లెక్స్‌.. ఫోటోలు వైరల్‌

    Super Star New Multiplex :  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో...

    Bangalore : భార్య ఆ విషయంలో గొడవ పడుతోందని దారుణంగా చంపేశాడు..

    Bangalore : భార్యాభర్తల బంధం అన్ని బంధాల్లో కెల్ల పవిత్రమైనది. అయితే...

    Bangalore : ప్రపంచంలో రద్దీ గల నగరాల్లో బెంగుళూరు స్థానమేంటో తెలుసా?

    Bangalore : ప్రపంచంలో జనాభా పెరుగుతోంది. దీంతో పలు సమస్యలు వస్తున్నాయి....

    Mobile Blast : ప్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్

    Mobile Blast : బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఓ యువకుడి...