![Bangalore](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/Bangalore.webp)
Bangalore : ప్రపంచంలో జనాభా పెరుగుతోంది. దీంతో పలు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు చెప్పనలవి కాదు. ప్రపంచంలోని పలు నగరాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువవుతోంది. ఫలితంగా ప్రయాణం ఆలస్యం అవుతోంది. వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. దీని వల్ల సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. టామ్ టామ్ ట్రాఫిక్ సూచీ -2023 ఈ తాజా విషయాలను వెల్లడించింది.
ప్రపంచలోనే రద్దీ గల నగరాల్లో బ్రిటన్ రాజధాని లండన్ నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి 37 నిమిషాలకు పైగా పడుతుందని వెల్లడైంది. తరువాత స్థానాల్లో డబ్లిన్ (ఐర్లండ్), టోరంటో (కెనడా) రెండు, మూడు స్థానాలు ఆక్రమించాయి. టాప్ -10 జాబితాలో మనదేశంలోని బెంగుళూరు (6), పుణె (7) లు నిలవడం గమనార్హం.
55 దేశాల్లోని 387 నగరాల్లోని 60 కోట్లకు పైగా ఇన్ కార్ నావిగేషన్ సిస్టమ్స్లు, స్మార్ట్ ఫోన్ల సమాచారం ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. గత సంవత్సరం బెంగుళూరులో 10 కిలోమీర్ల ప్రయాణానికి సగటున 28.10 నిమిషాలు పట్టినట్లు తెలిపింది. ఏడాదిలో 132 గంటలు కోల్పోయారు. సగటు వేగం గంటకు 18 కిలోమీటర్లు మాత్రమే అని తెలుస్తోంది.
పుణెలో కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగానే ఉంది. వాహనాల సగటు వేగం గంటకు 19 కిలోమీటర్లుగానే ఉంది. మొత్తం జాబితాలో ఢిల్లీ, ముంబయి 44, 54 స్థానాల్లో నిలిచాయి. మనదేశంలో కూడా అత్యంత రద్దీగల నగరాలు పెరుగుతున్నాయి. బెంగుళూరు ముందు వరసలో నిలిచిన కాలుష్య నగరాల్లో ఢిల్లీ ముందుంటుంది. ఇలా వాహనాల సంఖ్య రోజురోజుకు పెరగడం ఇబ్బందులను తెస్తోంది.