28 C
India
Friday, May 17, 2024
More

    Vadivelu Wife : చంద్రముఖిలో వడివేలుకు భార్యగా చేసిన నటి ఈమె.. ఇప్పటికీ ఆమె అందం రెట్టింపు అయ్యిందంటే నమ్ముతారా?

    Date:

    Vadivelu Wife
    Vadivelu Wife in Chandra Mukhi

    Vadivelu Wife in Chandramukhi : సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘చంద్రముఖి’ ఒకటి. 2005లో రిలీజైన ఈ మూవీ సంచలనాలను నమోదు చేసింది.
    రజనీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ పి వాసు ఈ సినిమాతో మరింత ఫేమస్ అయ్యారు. తమిళంలో కాకుండా తెలుగులో సెన్షేషన్ క్రియేట్ చేసింది.

    ప్రభు, జ్యోతిక, నయనతార, నాజర్, వినీత్, వడివేలు కీలక పాత్రల్లో కనిపించారు. వసూళ్ల పరంగా 2005లో రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇందులో రజినీ, వడివేలు మధ్య కామెడీ బాగా పండింది. వడివేలు భార్యగా నటించిన నటించింది సువర్ణ మాథ్యూ సినిమాలో కూడా ఆమె పేరు సువర్ణగా పెట్టారు.

    ఈ సినిమాలో రజినీకాంత్ నుంచి సువర్ణను వడివేలు కాపాడుకునే సీన్స్ కడుపుబ్బా నవ్వించాయి. ఈ మూవీ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన సువర్ణ.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. థాయ్ మనసు మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన సువర్ణ.. మయాబజార్, పెరియతంబి, గోకులంలో సీత వంటి చిత్రాల్లో నటించింది.

    1990లో తమిళం, మలయాళం భాషల్లో చాలా సినిమాలు చేసింది. తెలుగులోనూ కనిపించింది. వివాహం తర్వాత సినిమాలకు కొంత దూరంగా ఉన్న సువర్ణ.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యామిలీ, ఫిల్లల ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎందుకంటే చంద్రముఖిలో కనిపించిన సువర్ణ.. అంతకంటే మరింత అందంగా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

    1992లో సువర్ణ మిస్ కేరళ టైటిల్‌ సొంతం చేసుకుంది. ఆ తర్వాతే  సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. 2003లో వర్గీస్ జాకబ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి కొడుకు జాకబ్, కుమార్తె జియా ఉన్నారు. పెళ్లి తర్వాత ఫ్యామిలీతో కలిసి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో సెటిలైంది. ప్రస్తుతం సువర్ణ ఇన్ స్టా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...

    Raghava Lawrence : రజనీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్ ఎందుకో తెలుసా?

    Raghava Lawrence : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం...

    Jailer Entered the Field : చంద్రబాబు కోసం రంగంలోకి దిగిన ‘జైలర్’..!.. స్పందించిన అశ్వినీదత్

    Jailer Entered the Field : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు...