26.7 C
India
Saturday, June 29, 2024
More

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    Date:

    KTR
    KTR

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో భారత రాష్ట్ర సమితి ఉంది. బీజేపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన రాకేష్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ పోటీలో నిలబెట్టింది. వాస్తవానికి ఆ స్థానం బిఆర్ఎస్ పార్టీదే. తిరిగి ఆస్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో పార్టీ ఉంది. మూడు జిల్లాలో పర్యటిస్తూ కేటీఆర్ తో పాటు ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పట్టభద్రులు ఆకట్టుకోడానికి గులాబీ శ్రేణులు ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. తిరిగి బిఆర్ఎస్ గెలువరాదనే పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీ ఉంది. బీజేపీ, బిఆర్ఎస్ కాకుండా తనకే దక్కాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు దక్కకుండా తనకే సొంతం కావాలనే ఆలోచనతో బీజేపీ పావులు కదుపుతోంది.

    తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో అన్ని తానై మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలు చేస్తున్నారు. వరంగల్ సమావేశానికి కేటీఆర్ వస్తున్నారని తెలిసి కూడా పట్టుమని నలబై మంది నాయకులు రాలేదు. అప్పటి నుంచి కేటీఆర్ ప్రసంగంలో మార్పు కనపడినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది. గడిచిన పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమైనమని ఇప్పుడు కేటీఆర్ అనడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చేసింది చెప్పుకోలేదంటున్న కేటీఆర్, ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని కూడా పలువురు పట్టభద్రులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ కు వరదలు వచ్చినప్పుడు స్వయంగా  సీఎం హోదాలో కేసీఆర్ పర్యటించారు. వరంగల్ ను రెండో హైదరాబాద్ చేస్తా అన్నారు. దాని గురించి ఎందుకు కేటీఆర్ మాట్లాడటంలేదు.

    అదేవిదంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాల భర్తీలో విఫలమైనది. దీనివల్ల ఎందరో నిరుద్యోగులు, వారి కుటుంబాలు  ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాయి. ఈ విషయంలో తప్పు చేశామని ఎందుకు ఒప్పుకోవడంలేదని పలు నిరుద్యోగ కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. నీ సెల్ఫ్ డబ్బా  కొట్టుకోవడంలో  విఫలమయ్యామని చెబుతున్నారు కేటీఆర్. కానీ నిరుద్యోగులను ఆదుకోవాలనే సొంత ఆలోచన లేదా అనే ప్రశ్నలు వరంగల్, ఖమ్మం, నల్గొండ నిరుద్యోగ పట్టభద్రులు, వారి కుటుంబాల నుంచి వ్యక్తం కావడం విశేషం.

    Share post:

    More like this
    Related

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలు.. ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు తెలంగాణ రాజధాని...

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    YS Sharmila : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: వైఎస్ షర్మిల

    YS Sharmila : డాక్టర్లు అవుదామని ఆశతో ఉన్న 24 లక్షల...