31.2 C
India
Saturday, June 29, 2024
More

    Viral Video : షాకింగ్.. గాలిపటంతో పాటు గాల్లోకి ఎగిరిపోయిన మూడేళ్ల బాలిక

    Date:

    Viral Video
    Viral Video

    Viral Video : గతంలో ఓసారి పసికందును గద్ద తన్నుకుపోయిన ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఐతే.. అది గ్రాఫిక్స్ అనీ, రియల్‌గా గద్ద ఎత్తుకుపోలేదని తర్వాత తెలిసిందే. ఐతే.. ప్రస్తుతం ఓ చిన్నారి గాలిపటంతో ఎగిరిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్లు షాక్ అవుతున్నారు. మళ్లీ మళ్లీ వీడియోను చూస్తున్నారు. మూడేళ్ల బాలిక గాలిపటంలో ఇరుక్కుపోయి గాలిలో ఎగురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  తైవాన్‌లోని సముద్ర నగరమైన నాన్‌లియోలో ఒక సమూహం భారీ పొడవైన నారింజ రంగు గాలిపటాన్ని ఎగురవేస్తోంది, అందులో మూడేళ్ల బాలిక చిక్కుకుపోయింది. ఆమె గాలిపటంతోపాటు గాలిలోకి ఎగిరింది.

    గాలిపటం తోకలో ఇరుక్కుపోయి గాలిలో ఎగురుతున్న బాలికను చూసి అక్కడున్న జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అమ్మాయి బరువు కేవలం 28 పౌండ్లు, గాలిపటంలో ఇరుక్కుపోయి గాలిలో 100 అడుగుల వరకు వెళ్లింది. 30 సెకన్ల పాటు గాలిలో ఎగిరిన తర్వాత .. ఫెస్టివల్‌లో ఉన్న ఒక గుంపు చిన్నారిని కిందకు లాగింది. అమ్మాయి పేరు లిన్. ఈ సంఘటనలో చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. బాలిక గాలిపటంలో ఎలా ఇరుక్కుపోయిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంతో పండుగ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి, ప్రజలకు నాన్లియావో మేయర్ లిన్ చిహ్-చియన్ క్షమాపణలు చెప్పారు.

    ట్విట్టర్లోని @InsaneRealitys అకౌంట్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు.  నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. “బోయింగ్ కంటే సేఫ్‌గా దిగింది” అంటూ ఒక నెటిజన్ కామెంట్ చెయ్యగా.. ఈ ఘటన జరుగుతున్నప్పుడు కొందరు మొబైల్‌లో వీడియో తీస్తుండటాన్ని తప్పుపట్టారు.

    Share post:

    More like this
    Related

    Kalki Movie : కల్కి.. రెండో రోజు ఊచకోత.. ఒక్క రికార్డు మిగలనివ్వలేదు..

    Kalki Movie Second Day : ప్రస్తుతం భారతదేశంలో కల్కి మేనియా...

    Varalakshmi : ‘‘నా పెళ్లికి రండి సార్..’’ మోదీ, బాలయ్య సహ ప్రముఖులకు వరలక్ష్మి ఆహ్వాన పత్రికల అందజేత!

    Varalakshmi Wedding Invitations : సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుల వారసులు...

    Ketika Sharma : కేతికా శర్మ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో రచ్చ 

    Ketika Sharma : కేతికా శర్మ తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీ లో ఎన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : నారాయణ నామస్మరణతో డెలివరీ.. మహిళ వీడియో వైరల్

    Viral Video : బిడ్డకు జన్మనివ్వడం ఏ స్త్రీకైనా పునర్జన్మతో సమానం...

    Viral Video : చేపలు కూడా రసాయనమే.. నెట్టింట వైరల్

    Viral Video : చేపలు స్వచ్ఛంగా దొరుకుతున్నాయి అనుకుంటే వాటిని కూడా...

    Jagan Why Not 175 : వైనాట్ 175 ఏమైంది జగన్?

    Jagan Why Not 175 : ఎదురుదెబ్బల నుంచి ఎంత త్వరగా...

    Ashlin Jimmi : ‘హీరోయిన్ పాత్ర రాలేదు.. కాబట్టి ముంబైపై టెర్రర్ అటాక్స్ కు ఓకే’.. ఓ రచయిత సంచలన వ్యాఖ్యలు..

    Ashlin Jimmi : ప్రపంచం మొత్తం ఉగ్రవాదం అనే భూతంతో అల్లాడిపోతుంది. ఈ...