26.1 C
India
Sunday, June 30, 2024
More

    YCP – BJP : ఘోర పరాజయం.. బీజేపీ వైపు చూస్తున్న వైసీపీ నేతలు

    Date:

    YCP - BJP
    YCP – BJP

    YCP – BJP : బీజేపీకి బలం మొత్తం ఉత్తరాదిలోనే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో అసలు ఏమాత్రం బలం లేదు. ఇప్పుడిప్పుడే ప్రాంతీయ పార్టీల అండదండలతో ఒక్కో అడుగు వేసుకుంటూ దూసుకుపోతుంది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి నోటా కన్నా తక్కువ ఓట్లు సాధించుకునే స్థాయి. అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు పోటీ చేసిన 10 స్థానాలలో 8 స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. ఇదంతా కూడా బీజేపీ కి టీడీపీ, జనసేన కూటమి వలన వచ్చిన బలమే అనేది స్పష్టం. ఈ క్రమంలో వైసీపీ నేతలకు ఆశ్రయం కల్పించడానికి రెడీ అవుతుందంటూ వార్తలు రావడంతో టీడీపీ, జనసేన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.

    గడిచిన ఐదేళ్లుగా అధికారం ఉంది కదా అని అహంకారంతో తమ వెనుక జగన్ ఉన్నాడు అనే పొగరుతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల నుంచి అధినేతల వరకు వారిపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అవమానాలకు గురిచేశారు వైసీపీ నేతలు. ఇప్పుడు తమకు అవకాశం వచ్చింది..  వారికీ తిరిగిచ్చే సమయం వచ్చిందనుకున్న టైంలో  ఇప్పుడు వైసీపీ నేతలు ఒక్క్కొక్కరుగా బీజేపీలో చేరబోతున్నారు అనే వార్త తెలియడంతో బీజేపీ నాయకత్వం పై  టీడీపీ, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జగన్ భజన చేస్తూ బాబుని అవమానించిన విడుదల రజనీ, నందమూరి ఆడపడుచు, నారా వారి కోడలు అయిన బాబు సతీమణి భువనేశ్వరి ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టిన వల్లభనేని వంశీ, టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన దేవినేని అవినాష్ వంటి నేతలందరూ బీజేపీలో చేరేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

    పొత్తు ధర్మానికి విరుద్ధంగా బీజేపీ అలాంటి వారికి తమ పార్టీలో చోటు కల్పిస్తే  వైసీపీ కి పోయేదేమీ ఉండదు. ఇటువంటి నేతలను ఛీ కొట్టి ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలకు ఓటర్లు జై కొట్టారు. ఇప్పుడు అదే నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటే ప్రజల నిర్ణయాన్ని అవమానించినట్లు అవుతుంది. అలాగే వైసీపీ నుండి వస్తున్న ఈ నేతలు తమతో పాటుగా వైసీపీ వ్యతిరేకతను కూడా బీజేపీలో కలుపుతారు. మళ్లీ ఎప్పుడైతే ఏపీలో జగన్ గాలి వీస్తుందో అప్పుడు నిర్దాక్షణ్యంగా బీజేపీ చెవిలో పువ్వు పెట్టి వైసీపీ గూటికి ఎగిరిపోవడం ఖాయం. ఇప్పుడిప్పుడే ఆంధ్రాలో బీజేపీ జెండా పట్టుకోవడానికి ముందుకొస్తున్న టీడీపీ క్యాడర్ అంతా మళ్లీ బీజేపీకి దూరం కావడం ఖాయం. ఒంటరిగా బీజేపీ ఎప్పటికీ ఆంధ్రాలో అధికారంలోకి రాలేని పరిస్థితి. బీజేపీ ఇటువంటి సందర్భంలో వైసీపీ నేతలకు వలస కేంద్రంగా మారుతుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    World Cup Celebrations : ప్రపంచ కప్ సంబురాలు.. ట్యాంక్ బండ్ పై అభిమానుల కేరింతలు

    World Cup Celebrations : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ లో...

    Virat Kohli : టీ20లకు విరాట్ బైబై

    Virat Kohli : టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20...

    Shruti Hasan : శృతి బ్రేకప్ చెప్పింది అందుకేనా?

    Shruti Hasan breakup : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    AP Pensions : పింఛన్ల పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలివే

    AP Pensions : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి...

    Aarogyasri Card : ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

    Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో...