25.3 C
India
Tuesday, July 2, 2024
More

    AP Pensions : పింఛన్ల పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలివే

    Date:

    AP Pensions
    AP Pensions

    AP Pensions : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. తొలుత అప్పుడు ప్రకటించిన విధంగా మెగా డీఎస్సీ ఫైలు పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. తర్వాత పెంచిన సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సామాజిక పింఛన్ల పంపిణీ పై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో ప్రభుత్వం మారడంతో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఎలా ఉంటుందోనన్న అనుమానాలు లబ్ధిదారుల్లో నెలకొన్నాయి.  వాలంటీర్ల ద్వారా అందిస్తారా? సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తారా? నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారా? అన్న అనుమానాలు వారిలో ఉన్నాయి. కానీ సచివాలయ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. సామాజిక పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే.  వృద్ధాప్య,వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టే వృత్తి వారు, ట్రాన్స్ జెండర్లు, ఏ ఆర్ టీ, ఆర్టిస్టులకు రూ.3000 నుంచి రూ.4 వేలకు పింఛన్ పెరిగింది. దివ్యాంగులు, కుష్టు రోగులకు ఇప్పుడున్న రూ.3000 నుంచి రూ.ఆరు వేలకు పెంచారు. పూర్తి వైకల్యం ఉన్నవారికి 5000 నుంచి రూ.15 వేలకు, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్, గుండె ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారు, డయాలసిస్ రోగులు తదితరులకు రూ.5000 నుంచి రూ.10000 కు పెంచారు.

    జూలై 1న మొదటి రోజు లబ్ధిదారులకు పెన్షన్ అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రతి సచివాలయ ఉద్యోగి తనకు కేటాయించిన 50 మందికి పింఛన్ అందించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తం అందించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని.. జూలై నెల 4000 తో కలిపి మరో మూడు వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నెలలో 7000 అందిస్తారు. వచ్చే నెల నుంచి రూ.4000 అందించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు అందించేవారు. ఇప్పుడు సచివాలయ సిబ్బందితో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక హెచ్ఐవీ బాధితులకు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న దివ్యాంగులకు  దివ్యాంగ  బ్యాంక్ ఖాతాలో నగదు మొత్తాన్ని జమ చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై రెండు నాటికి పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయం తెలిసిన లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    NTR Bhavan : ఎన్టీఆర్ భవన్ పై దాడిపై విచారణ స్పీడప్..ఇక వాళ్లకు దబిడే దిబిడే

    NTR Bhavan attack Case : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై...

    Minister Wife Warning : పోలీసులకు మంత్రి భార్య వార్నింగ్.. చంద్రబాబు సీరియస్

    Minister Wife Warning : సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన రోజు...

    Vijay and Trisha : విజయ్, త్రిషల మధ్య సంబంధాన్ని బయటపెట్టిన సుచిత్ర

    Vijay and Trisha : కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్, హీరోయిన్...

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Chandrababu : వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    CM Chandrababu : ఏపీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ...

    TTD Chairman : టీటీడీ చైర్మన్ పదవి వారికేనా..?

    TTD Chairman : ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మికత ప్రదేశం తిరుమల. కలియుగ...

    TDP AP President Palla : కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తా: టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా

    TDP AP President Palla : టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక...

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...