38.1 C
India
Sunday, May 19, 2024
More

    కెనడాలో మరో భారతీయ విద్యార్థి.. ఆ చావులకు కారణం ఎవరు..?

    Date:

     

    కెనడాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మరణం మిస్టీరియస్ గా మారింది. గతంలో ఒక విద్యార్థి మృతదేహం కనిపించగా.. ఇప్పుడు మరో విద్యార్థి మృతదేహం కనిపించింది. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు బంధువులు తెలిపిన వివరాలను బట్టి..

    గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ కు చెందిన ఆయుష్ (23 సంవత్సరాలు) కెనడాలోని టొరంటోలో చదువుకుంటున్నారు. గుజరాత్ పోలీస్ శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న రమేశ్ డంఖారా కొడుకు ఆయుష్. చదువు కోసం కెనడా వెళ్లిన ఆయుష్ టొరంటోలోని లారెన్స్ అవెన్యూ వెస్ట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 6న బయటకు వెళ్లిన ఆయన తిరిగి రూమ్ కు రాలేదు. పలుమార్లు ఫోన్ లో సంప్రదించినా.. వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అక్కడి ఆయుష్ ఫ్రెండ్స్ చెప్పారు. టొరంటో పోలీసులు మే 7న వంతెన కింద ఒక అనుమానాస్పదంగా మృతదేహాన్ని కనుగొన్నారు. విచారించగా ఆయుష్ మృతదేహంగా నిర్ధారణ అయ్యింది.

    ఫార్మాలిటీస్ పూర్తి చేసి అంతిమ సంస్కారాల కోసం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆయుష్ తండ్రి రమేశ్ కెనడా వెళ్లారు. ఆయుష్ మృతదేహంతో శనివారం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా నెల రోజుల వ్యవధిలో ఇది రెండో అనుమానాస్పద మృతి. ఇద్దరూ గుజరాత్ కు చెందిన వారు కావడం గమనార్హం. గతంలో హర్ష్ పటేల్ అనే వ్యక్తి కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇద్దరూ యార్క్ యూనివర్శిటీలో, ఆయుష్ ఇంజినీరింగ్ లో, హర్ష్ మేనేజ్‌మెంట్ స్టడీస్ లో చదువుతుండేవారు. ఈ ఇద్దరి మృతిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వీరిద్దరూ ఒక రోజుకు పైగా కనిపించకుండా పోవడం, వారి ఫోన్లు చుట్టుపక్కల లేకపోవడం, ఇద్దరి మృతదేహాలు చెరువులోనే కనిపించడం. హర్ష్ పటేల్ చివరి రోజుకు సంబంధించి చెప్పుకోదగ్గ వివరాలేవీ బయటకు రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కేసును క్లోజ్ చేయాలని కోరుతున్నారు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు..

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కెనడాలో...

    Canada : కెనడా వెళ్లనంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?

    Canada : ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత...