హైదరాబాద్ లో ఎన్టీఆర్ తన కూతురి పేరుమీద ఓక చిన్న ఇల్లు తీసుకున్నాడు అది రోడ్ నెంబర్ 13 లో ఉండేదని అందులో నే మేము ఇద్దరం ఉండేవాళ్లం అని లక్ష్మిపార్వతి అన్నారు. ఆఇంట్లో నే మా పెళ్లి కూ డా జరిగిందన్నారు. ఆ చిన్న ఇంట్లో ఓకే ఓక బెడ్ రూం మాత్రమే ఉండేదని ఆమె తెలిపారు. 1982 లో ఎన్టీఆర్ నేను సన్యాసం తీసుకుంటున్నానని ప్రకటన చేశారు. నేను సంపాందించిన ఆస్థులు అన్నీ నా పిల్లలకు ఇచ్చేశాని నేను రాజకీయాల్లో ఏమి సంపాదించలేదు. ఇక మిగిలింది బూడిదేఅని ఆనాడు ఏన్టీఆర్ అన్నారని పార్వతి గుర్తుచేశారు. నేను ఆయన జీవితంలోకి వచ్చే సరికి ఆయన ఆరోగ్యం బాగా క్షీనించి పోయిందని ఆమె తెలిపారు. షుగర్ పెరిగిపోవడంతో ఆతర్వాత పెరాలసిస్ రావడం తో నేను ఆసుపత్రికి తీసుకెళ్లి రెండు సార్లు ఆయన ప్రాణాలను కాపాడుకున్నానని ఆమె తెలిపారు. మేజర్ చంద్రకాంత్ సినిమా తర్వాత ఆయన ఆరోగ్యం మెత్తం పూర్తిగా పాడైపోయిందని ఆమె తెలిపారు.
లక్ష్మీపార్వతితో JAISWARAAJYA TV ఇంటర్వ్యూ వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.