Adipurush – Chandrayan -3 : మన సినిమాల బడ్జెట్ పెరుగుతోంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. బాహుబళి రెండు సినిమాలకు చేసిన ఖర్చు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. రాజమౌళి సినిమాల బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు సినిమాల బడ్జెట్ హాలీవుడ్ సినిమాల రేంజ్ లో వెళ్తోంది. దీంతో నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీకైతే రూ.650 కోట్లకు పైనే ఖర్చు చేశారు. దీంతో సినిమాల బడ్జెట్ ఇంతలా పెరగడంతో ఆందోళన మొదలవుతోంది.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కు రూ. 500 కోట్లపైనే ఖర్చయింది. ఇప్పుడు ప్రాజెక్టు కె చిత్రానికి భారీ తారాగణం ఉండటంతో వారికే దాదాపు రూ.200 కోట్లు పెట్టాల్సి వస్తోంది. ఇస్రో చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు రూ.650 కోట్లు ఖర్చు చేసి అద్భుతాలు సృష్టించింది. కానీ మన సినిమాలు మాత్రం ఇంత భారీ బడ్జెట్ పెట్టినా నిరాశపరచడంతో నిర్మాతలు కోలుకోలేని విధంగా దెబ్బ తింటున్నారు.
ఒక రాజమౌళి మాత్రం తాను ఎంత భారీ బడ్జెట్ తో తీసినా వారికి తగిన ప్రతిఫలం సమకూరుస్తున్నారు. మిగతా వారు మాత్రం నష్టాలే కలిగిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన చిత్రాలు నిరాశపరచడం గమనార్హం. పాన్ ఇండియా మూవీస్ పేరుతో భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సినిమా అంటేనే డబ్బులమయంగా మారింది.
రూ. వందల కోట్లు తేలికగా తీసుకుంటున్నారు. నష్టాలొచ్చినా మళ్లీ అదే రేంజ్ లో ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో సినిమాల నిర్మాణం బాగా ఖరీదుగా మారిపోయాయి. కోట్లతోనే ముడిపడి ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు కూడా బోల్తా కొడుతున్నాయంటే తప్పు ఎక్కడ జరుగుతుందో అని సందేహాలు వస్తున్నాయి.