
కరోనా పుట్టినిల్లు చైనా కరోనాతో అల్లాడుతోంది. కోవిడ్ ను కంట్రోల్ చేయాలని కఠిన ఆంక్షలు పెట్టింది చైనా అయితే జీరో కోవిడ్ పాలసీ వల్ల ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురు అవుతున్నాయని భావించి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేయడంతో చైనా ప్రభుత్వం దిగొచ్చింది. కట్ చేస్తే ఆంక్షలు సడలించడంతో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. దాంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
చైనాలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతుండటంతో కొత్త వేరియంట్ లు నమోదు అయ్యే అవకాశం ఉందని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దాంతో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. కరోనా టెస్ట్ లను పెంచాలని నిర్ణయించాయి. రాబోయే మూడు నెలల్లో కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరగనున్నాయని , ముఖ్యంగా చైనాలో దాదాపు 60 శాతం మందికి కరోనా సోకనుందని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో 10 శాతానికి పైగా కేసులు నమోదు అవుతాయని చెప్పడంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. రాబోయే మూడు , నాలుగు నెలల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవ్వడం ఖాయమని అంటున్నారు.