5 శతాబ్దాల హిందువుల కల సాకారమైంది.. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువుదీరాడు. నేటి నుంచి సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటూ పరవశించి పోతున్నారు. ఒక చేతిలో విల్లు..మరో చేతిలో బాణంతో అందమైన రూపంతో అద్భుతంగా ఉన్న రామయ్య విగ్రహం చూసి భక్తులు తరించిపోయారు. 500 ఏళ్ల హిందువుల నిరీక్షణకు తెరపడిందని ప్రతి ఓక్కరు బావిస్తున్నరు.
రామజన్మభూమిలో మొత్తం 70 ఎకరాల్లో శ్రీరాముడి ఆలయ కాంప్లెక్స్ ఉంటుంది. అందులో 70 శాతం పచ్చదనంతో నిండి ఉంటుంది. భక్తులు తూర్పు దిక్కు నుంచి ఆలయంలోకి ప్రవే శించి దక్షిణ దిక్కు నుంచి బయటకు వస్తారు. భక్తులు ఆలయం లోకి వెళ్లాలంటే మొత్తం 32 మెట్లు ఎక్కా ల్సి ఉంటుంది. జీ+2 పద్ధతిలో ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తులో ఉంటుంది.
ప్రతి అంతస్తులో 392 చొప్పు న స్తంభాలు, 44 ప్రవేశమార్గాలు ఉంటాయి. ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పున, 732 మీటర్ల వైశా ల్యంతో కైవారం నిర్మించారు. సూర్యుడిని తలపించేలా 30 అడుగుల ఎత్తున నిర్మించిన 40 స్తంభాలు అయోధ్య నగరంలో రాత్రిపూట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.