32.6 C
India
Saturday, May 18, 2024
More

    బిల్కిస్ బానో కేసుపై సుప్రీం కోర్టు తీర్పు

    Date:

    బిల్కిస్ బానో కేసు: సుప్రీం కోర్టు తీర్పు
    కేసు నేపథ్యం:
    2002 లో గుజరాత్: గోద్రా రైలు దహన కాండ అనంతరం అల్లర్లు జరిగాయి. ఒక వర్గం వారు మరో వర్గం వారి పై దాడి జరిగింది. గృహ దహనాలు, హత్యలు, మాన భంగాలు విచక్షణారహితంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక కుటుంబం ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నించింది. అదే ప్రాంతానికి చెందిన కొంతమంది వారిపై దాడి చేశారు. బిల్ కిస్ బానొ నాలుగు నెలల గర్భిణి; ఆమె చెల్లెలు పచ్చి బాలింత. నెలల బిడ్డను నేలకేసి కొట్టారు, బాలింత అనికూడా ఉపెక్షించకుండా ప్రాణాలు తీశారు. బీల్కిస్ పై సామూహిక అత్యాచారం చేశారు. స్పృహ తప్పి న ఆమెను చూసి చనిపోయింది అనుకుని వెళ్లిపోయారు. స్పృహ వచ్చిన ఆమె తాను నగ్నంగా ఉన్నాను అని గ్రహించింది; చుట్టూ పడివున్న కుటుంబ సభ్యుల శవాలు చూసింది. దగ్గరలో వున్న గుడ్డ చుట్టు కున్నది. తిన్నగా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. రిపోర్ట్ చేసింది. కానీ పోలీసులు కేసు బుక్ చేయలేదు. తన కుటుంబంలో తన మూడేళ్ల కూతురుతో పాటు మరో ఆరుగురు చనిపోగా మిగతా వారి జాడ తెలియలేదు.

    అప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు.
    ఈ అల్లర్లు దేశాన్ని కుదిపేశాయి. నాటి ప్రధాని తీవ్రంగా స్పందించారు. పోలీస్ చర్య ప్రారంభం అయింది. 11 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. అహ్మదా బాద్ లో కోర్టు విచారణ ప్రారంభం అయింది. కానీ బిల్ కిస్ సాక్ష్యాలు తారు మారు చేస్తారు అన్న సందేహం వ్యక్తం చేయడంతో కేసు అహ్మదాబాద్ నుంచి ముంబై కి మార్చారు. శవాలను పెకలించి చూడగా తలలు లేని మొండేలు కనిపించాయి. కేసు జటిలమైన ఎట్టకేలకు నేరం రుజువయింది; 11 మందికి జీవిత కాలం శిక్ష పడింది; ముంబై హైకోర్టు కూడా ఈ యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.
    15 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న సమయంలో కేసు కొత్త మలుపు తిరిగింది.

    2008 జనవరి 21 న సీ బీ ఐ న్యాయస్థానం యావజీవ శిక్ష విధించింది; 15 ఏళ్ల తర్వాత నిందితులలో ఒకరు తనను విడుదల చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆ అభ్యర్థనను పరిశీలించాలని గుజరాతీ ప్రభుత్వానికి రిఫర్ చేసింది. గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ రేమిషన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. 2022 మే నెలలో వచ్చిన తీర్పు తమకూ వర్తింప చేయా లి అని వారూ అభ్యర్థన పెట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు గుజరాత్ ప్రభుత్వంతో కుమ్మక్కై సుప్రీం కోర్టును తప్పు దోవ పట్టించి తీసుకున్న రేమీషన్ ఆర్డర్, మిగతా వారికే వర్తింప జేశారు; 2022 ఆగస్ట్ 15 న అందరినీ విడుదల చేసింది.
    తన బిడ్డను, తన కుటుంబాన్ని చంపి, గర్భవతి అయిన తనను మూకుమ్మడిగా చెరిచి తన కళ్ళ ముందే తిరుగు తుంటే చూస్తూ భరించ లేక, వారి నుంచి తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని భయపడుతూ బ్రతకలేక తల్లడిల్లింది బిల్ కిస్. హత్య., అత్యా చారం చేసి 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి శిక్షా కాలం పూర్తి కాకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి బయటకు వచ్చిన వారిని హీరోలుగా కీర్తిస్తూ దండలు వేసి, మిఠాయిలు పంచి, ఊరేగింపు గా తీసుకురావడం భరిం చలేక పోయింది. తన ఆచూకీ వారికి దొరక కుండా జాగ్రత్త పడుతూ బిల్ కిస్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది.
    బిల్ కిస్ తో పాటు సీపీఎం నేత సుభాషిణి అలీ, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ రేవతి లాల్, లాఖ్నవూ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ రూప్ రేఖ వర్మ, టీఎంసీ లీడర్స్ మహువా మోయిత్రా మరి కొందరు ఇదే కేసులో పిల్ దాఖలు చేశారు.
    ముంబై సీబీఐ కోర్టులో కేసు నడిచింది; కానీ గుజరాత్ రాష్ట్రంలో కోర్టు రేమిషన్ ఇచ్చింది.
    1922 లో గుజరాత్ ప్రకటించిన శిక్ష తగ్గింపు ఈ కేసుకు వర్తించదు అని జస్టిస్ BV నాగరత్నం- జస్టిస్ ఉజ్జల్ భయాన్ నేతృత్వం వహించిన సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ తీర్పు వెలువ రిస్తూ రెండు వారాలలో నిందితుల ను కస్టడీ లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చారు.
    ఈ తీర్పు పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...