28 C
India
Friday, May 17, 2024
More

    ఉద్ధవ్ కు సుప్రీం షాక్.. ఆ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమంటూ వ్యాఖ్యలు

    Date:

    Uddhav, upreme Court
    Uddhav, Supreme Court

    Uddhav : మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరు సరిగా లేకున్నా ఉద్ధవ్ ప్రభుత్వాన్ని తిరిగి నియమించలేమని చెప్పింది. ఆ సమయంలో బలపరీక్ష ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడ సరైందని కాదని వెల్లడించింది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం, షిండే వర్గం వేర్వేరుగా  దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ చేసిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరును ధర్మాసనం తప్పుబట్టింది.

    Uddhav ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని నిర్ధారణకు వచ్చేందుకు గవర్నర్ వద్ద సరైన సమాచారం లేకుంటే.. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని పిలవడం సరికాదని, గవర్నర్ విచక్షణ అధికారులను అమలు చేసిన తీరు చట్టపరంగా లేదు. దీంతో పాటు పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు బలపరీక్షను మాధ్యమంగా వాడలేం. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే బల పరీక్ష ఎదుర్కోకుండా రాజీనామా చేయడంతో మళ్లీ ఆయన ప్రభుత్వా్న్ని పునరుద్ధరించలేం. ఠాక్రే రాజీనామాతో మెజార్టీలోకి వెళ్లిన బీజేపీ అభ్యర్థి ఏక్‌నాథ్ షిండేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం సరైన చర్యే అవుతుంది.’ అని కోర్టు వెల్లడించింది.

    షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై తేలకుండానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించిన అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయాన్ని వాదనలో భాగంగా ఉద్ధవ్ వర్గం ప్రశ్నించింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్ కు రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీస్ జారీ చేసే అధికారులు ఉంటాయా అన్నదానిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...