29.5 C
India
Sunday, May 19, 2024
More

    1983-2024 Cycle History : 1983-2024.. ఇది సైకిల్ పసుపు చరిత్ర

    Date:

    1983-2024 Cycle History
    1983-2024 Cycle History

    1983-2024 Cycle History : సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని నమ్మిన నాయకుడు ఎన్టీఆర్. చరిత్ర లిఖించిన నేతగా ఆయన మనకు సుపరిచితుడే. చలన చిత్ర రంగంలోనే కాకుండా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన నేతగా ఆయన గురించి తెలిసిందే. పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన చరిత్ర ఆయనది. విశ్వ విఖ్యాత నటుడిగా ఎన్టీఆర్ ఎన్నో మైలురాళ్లు దాటాడు.

    తెలుగు వాడి ఖ్యాతిని దశదిశలా చాటిన వాడిగా ఎన్నో రికార్డులు కొల్లగొట్టారు. 1982లో మార్చి 29న తెలుగుదేశం పార్టీని చారిత్రక ఘట్టానికి తెరలేపారు. మొదటి బహిరంగ సభ హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించారు. ఆకుపచ్చని నాగలి, తెల్లనైన కుటీరంలో తెలుగుదేశం పతాకాన్ని రూపొందించారు. మొదటి ప్రచార యాత్ర 20 రోజుల పాటు తెలంగాణలో సాగింది. తరువాత రాయలసీమలో పిదప కోస్తాలో పర్యటించారు.

    292 స్థానాలకు గాను 202 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 60 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గింది. తెలుగుదేశం పార్టీ పిలుపునందుకుని ఓటర్లు ప్రభంజనం కల్పించారు. దీంతో ఎన్టీఆర్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. జనవరి 9, 1983లో ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎన్నికయ్యారు.

    ఆగస్టు 16, 1984లో ఢిల్లీ పెద్దల కుట్ర ఫలితంగా ఎన్టీఆర్ పదవీచ్యుడిగా మారారు. నాదెండ్ల భాస్కర్ రావు కుట్రలు చేసినా మళ్లీ ఎన్టీఆర్ నే పదవి వరించింది. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఊరట కలిగించాయి. 1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 30 సీట్లు గెలుచుకుని టీడీపీ ప్రతిపక్ష హోదా పొందింది.

    1985లో జరిగిన మధ్యంతర శాసనసభ ఎన్నికల్లో 202 సీట్లు సాధించింది. తిరుమలలో నిత్యాన్నదాన మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. 1994లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ 216 స్థానాలు గెలుచుకుంది. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అలా టీడీపీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

    అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంతో విడిపోయాక కూడా అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం అధికారం కోల్పో యింది. ఇక ఇప్పుడు 2024లో టీడీపీ మరోమారు అధికారంలోకి రావడం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. అందుకే టీడీపీ తన ప్రభావం పెంచుకుంటోంది. అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....

    YCP 11th List : వైసీపీ 11వ జాబితా.. ‘గొల్లపల్లి’కి బంపరాఫర్

    YCP 11th List : వైసీపీ అభ్యర్థుల ప్రకటనను మరింత వేగవంతం...