- అన్న ఎన్టీఆర్ పై ప్రిస్కో మేయర్ కీలక ప్రకటన

తెలుగు జాతి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. ప్రతి తెలుగోడు గర్వంగా చెప్పకునే పేరు ఎన్టీఆర్. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తన కంటూ చరిత్రలో ఓ పేజీ లిఖించుకున్న గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటికీ ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానం. ప్రధానుల నుంచి సీఎంల వరకూ ఆయనకు ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. ఎవరికీ సాధ్యం ఎన్నో పాత్రలను పోషించి సినిమా రంగంలో నట సార్వభౌముడిగా పేరొందిన ఎన్టీఆర్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆయన మరణాంతరం ఎన్టీఆర్ కు ప్రస్తుతం భారత రత్న ఇవ్వాలని డిమాండ్ వస్తున్న తరుణంలో ఇప్పుడు టెక్సాస్ మేయర్ ప్రకటన కీలకంగా మారింది.
ఇంతకీ టెక్సాస్ మేయర్ ప్రకటన ఏంటంటే..
ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో అమెరికాలోని టెక్సాస్ లోని ప్రిస్కో మేయర్ జెఫ్ చెన్ని ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నగారి పుట్టిన రోజుల సందర్భంగా మే 28న ‘ ప్రిస్కో నగర తెలుగు హెరిటేజ్’ డే గాప్రకటించారు. తెలుగు వారి గుండె చప్పుడైన ఎన్టీఆర్ను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

తెలుగు నేలలో ఓ చరిత్ర ఎన్టీఆర్..
ఎన్టీఆర్ పేరు చెబితేనే తెలుగు నేల పులకిస్తుంది. ఆయనపై ఇప్పటికీ అదే అభిమానం చూపిస్తారు. ఉత్తరాది అధిపత్యాన్ని ప్రశ్నించే తెలుుగు వారు గర్వ పడేలా తెలుగు దేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి తెచ్చారు. ఇక తనకంటూ సినిమా రంగంలోనూ ఎవరికీ సాధ్యం కాని పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన శత జయంత్యుత్సవాలు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాలు, దేశ విదేశాల్లో ఆయన అభిమానులు ఉన్న ప్రతి చోట అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ప్రిస్కో నగర మేయర్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు రాష్ర్టాల్లోని ఆయన అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. దీనిని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.