38.7 C
India
Saturday, May 18, 2024
More

    ‘ఏజెంట్’ మూవీ ఫుల్ రివ్యూ..

    Date:

    Akhil Agent
    Akhil Agent

    తారాగణం: అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, సాక్షి వైద్య, సంపత్ రాజ్, డినో మోరియా

    సంగీతం: హిప్ హాఫ్ తమీజా, భీమ్స్
    దర్శకత్వం : సురేందర్ రెడ్డి
    నిర్మాతలు: సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర
    స్టోరీ : వంశీ వక్కంతం

    అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీపై అఖిల్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్టు ప్రకటించిన సమయంలో అంచనాలు మిన్నంటాయి. బిజినెస్ రూ. 70 కోట్ల రేంజ్ ఉంది. దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న సురేందర్ రెడ్డి కూడా నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు రూ. 80 కోట్ల వరకూ సినిమాకు వెచ్చించారు. కానీ ప్రీరిలీజ్ థియేటికర్ బిజినెస్ రూ. 37 కోట్లు మాత్రమే జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

    స్టోరీ: టెర్రరిస్ట్ మూవ్‌మెంట్ ను నిరోధించేందుకు స్పెషల్ ఆఫీసర్ కల్నల్ మహాదేవ్ (మమ్ముట్టి) ఆధ్వర్యంలో ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తారు. ఈ గ్రూప్ నుంచి వెళ్లిన ఏజెంట్లు ఆ టెర్రరిస్ట్ ముఠాను పట్టుకోలేకపోతుంటారు. అదే టైంలో మహాదేవ్ కు అఖిల్ కనిపిస్తాడు. అతనిలోని గట్స్ చూసి స్పై ఏజెంట్ గా పంపిస్తాడు మహాదేవ్. మహాదేవ్ పెట్టిన టాస్క్ ను అఖిల్ సాధిస్తాడు. తర్వత అఖిల్ ను చంపమని మహాదేవ్ టీంను ఆదేశిస్తాడు. అఖిల్ ను ఎందుకు చంపమని చెప్తాడు..? అతనికి టెర్రరిస్టులకు ఏమైనా లింకులు ఉన్నాయా..? చివరికి ఏమైంది.? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    విశ్లేషణ : సురేందర్ రెడ్డి దర్శకత్వం స్టైలిష్ గా ఉంటుంది. హీరో కార్యక్టరైజేషన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. స్టోరీ సాధారణంగా ఉన్నా స్ర్కీన్ ప్లే విషయంలో వేరే లెవల్ గా ఉంటుంది. ఇందులో కూడా అదే ప్రయత్నించాడు. కానీ తాను అనుకున్నంత రాణించలేకపోయాడని తెలుస్తోంది. అఖిల్ విషయంలో మాత్రం అనుకున్నంత స్టైలిష్ గా చూపించాడు. ఈ మూవీ కోసం అఖిల్ పడిన శ్రమ ప్రతీ సీన్ లో కనిపిస్తుంది. ఇక మళయాల స్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సాధారణంగా ఆయన స్పెషల్ రోల్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపరు. కానీ ఈ సినిమాకు ఎందుకు ఒప్పుకున్నాడో తెలుస్తోంది. మంచి నటనతో సీనీ ప్రేక్షకులను అలరిస్తాడు. ముఖ్యంగా ఆయన పాత్రలోని షేడ్స్, ట్విస్ట్స్ చూస్తే ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

    హీరోయిన్ సాక్షి వైద్య తన పాత్రకు న్యాయం చేసింది. ఇక క్వాలిటీ విషయంలో నిర్మాత ఎక్కడా తగ్గలేదని అనిపిస్తుంది. భారీగానే చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని మ్యూజిక్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. హిప్ హాప్ తమీజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటులు ప్రేక్షకులలోకి వెళ్లలేదనిపస్తుంది. మొత్తానికి మంచి డీసెంట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ అందించాడు సురేందర్ రెడ్డి.

    చివరి మాట : స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారు దీన్ని చూడచ్చు. మూవీలోని కన్ని ఇంట్రస్టింగ్ సీన్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు.

    రేటింగ్: 2.5/5

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Agent OTT : అక్కినేని అఖిల్ కు మరో షాక్ ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ పై కోర్టు స్టే..

    Agent OTT : అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై...

    అందుకే సినిమా పోయింది.. ‘ఏజెంట్’పై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

    నాగార్జున ఫ్యామిలీకి గడ్డుకాలం నడుస్తోంది. ఆయనతో పాటు ఆయన కొడుకులు నాగ...

    ఈ నెలలోనే ఓటీటీలోకి ఏజెంట్.. ఏ తేదీ అంటే..

    అక్కినేని అఖిల్ రీసెంట్ మూవీ ‘ఏజెంట్’ ఓటీటీ తేదీని అధికారికంగా ప్రకటించింది...

    ఆ దోషం అక్కినేని ఫ్యామిలీని పట్టుకుంది.. అందుకే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

    మనంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో...