33.9 C
India
Sunday, May 12, 2024
More

    Agent OTT : అక్కినేని అఖిల్ కు మరో షాక్ ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ పై కోర్టు స్టే..

    Date:

    Agent OTT :
    అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై యాక్షన్ మూవీ ఏజెంట్ . వాయిదాదాల మీద వాయిదాలు పడుతూ ఈ యేడాది ఏప్రిల్ 28న గ్రాండ్‌గా విడుదలైన మొదటి షో నుంచే ప్లాఫ్ టాక్ ను మూటగట్టుకుంది. అఖిల్ అండ్ సురేందర్ రెడ్డి గత చిత్రాల కన్నా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ విడుదలైన మూడు వారాలకే ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఆ తర్వాత వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ఈ నెల 29న స్ట్రీమింగ్‌కు రానుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే విధించింది. విశాఖకు చెందిన ప్రముఖ పంపిణీదారుడు బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
    ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో నిర్మాత తనను మోసం చేశారంటూ కోర్టుకెక్కాడు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. ఆయన వాదనలు విన్న తర్వాత ఈ నెల 29న ఏజెంట్ చిత్రం స్ట్రీమింగ్ కాకుండా స్టే ఇచ్చింది. ఈ విషయాన్ని సతీష్ బత్తుల లాయర్ మీడియాకు తెలిపారు.
    మొత్తంగా థియేటర్స్‌లో చూడని ఆడియన్స్ ఈ సినిమాను ఓటీటీలో చూద్దామనుకున్న అక్కినేని ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్ పరిణామనే చెప్పాలి.  ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. స్పై యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంస్థలు కలిసి రూపొందించాయి. ఈ ఏడాది భారీ డిజాస్టర్ గా నిలిచింది.  మొదటి మూడు రోజులు కూడా సినిమా నిలబడలేకపోయింది.  ఈ సినిమా హైప్ కోసం మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి ప్రధాన పాత్రలోకి తీసుకున్నారు. అయితే కాస్టింగ్ భారీగా ఉన్నా సినిమా మాత్రం తేడా కొట్టింది. .ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.65 కోట్ల షేర్ (రూ. 10.65 కోట్ల గ్రాస్). వరల్డ్ వైడ్‌గా మొత్తం 6.90 కోట్లు.. (రూ. 13.35 కోట్ల గ్రాస్) అందుకుంది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 36.20 కోట్లుగా ఉంది. రూ. 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా.. రూ. 30.10 కోట్ల థియేట్రికల్‌గా నష్టాలను మిగిల్చింది.
    ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక ‘సోనీలివ్‌’ దక్కించుకుంది.  థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన ఎనిమిది వారాలకు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందని ముందుగా తెలిపారు.  బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టడంతో ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ముందుకు జరిపారు. తీరా ఇపుడు నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్‌ తో జరిగిన గొడవతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పైనా కోర్టు స్టే విధించింది.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    SS Rajamouli : నీ కొడుకుతో సినిమా తీయను.. స్టార్ నిర్మాత మొహం మీదే చెప్పేసిన రాజమౌళి

    SS Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ఆయన సినిమా...

    అందుకే సినిమా పోయింది.. ‘ఏజెంట్’పై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

    నాగార్జున ఫ్యామిలీకి గడ్డుకాలం నడుస్తోంది. ఆయనతో పాటు ఆయన కొడుకులు నాగ...

    ఈ నెలలోనే ఓటీటీలోకి ఏజెంట్.. ఏ తేదీ అంటే..

    అక్కినేని అఖిల్ రీసెంట్ మూవీ ‘ఏజెంట్’ ఓటీటీ తేదీని అధికారికంగా ప్రకటించింది...

    ఆ దోషం అక్కినేని ఫ్యామిలీని పట్టుకుంది.. అందుకే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

    మనంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో...