
Pawan OG : రాజకీయ రంగంలో, సినిమా రంగంలో ఎప్పుడు చిరకాల మిత్రులు చిరకాల శత్రువులు ఉండరు అనేది జగమెరిగిన సత్యం.. ఇప్పటికే ఈ విషయం అందరికి క్లారిటీగా బోధ పడింది.. ఎంతో మంది బద్ధ శత్రువులు సైతం ఈ రంగాలలో కలిసి వారు ఉన్నారు.. అలాగే మంచి మిత్రులు విడిపోయిన వారు ఉన్నారు. ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చూసాం..
ఇక సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఎంతో మిత్రులుగా ఉన్న ఎందరో విడిపోయారు.. ఈ కోవలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ కమెడియన్ అలీ కూడా ఉన్నారు. వీరి మొదటి నుండి ప్రతీ సినిమాలో కలిసి నటించారు. వీరి పెయిర్ అంటే టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరికి ఇష్టం..
పవన్ కళ్యాణ్ కు సినిమా రంగంలో ఉన్న అతికొద్ది మంది సన్నిహితుల్లో అలీ కూడా ఒకరు.. అయితే వీరిద్దరి కాంబోలో గత కొద్దీ రోజుల నుండి సినిమాలు రావడం లేదు.. వీరిద్దరి కాంబోలో సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా గుర్తుండి పోతాయి.. ఇక పవన్, అలీ పాలిటిక్స్ పుణ్యమా అని వీరు దూరం అయిన విషయం తెలిసిందే..
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టగ అలీ వైసీపీ లో జాయిన్ అయ్యారు.. దీంతో వీరి మధ్య గ్యాప్ వచ్చేసింది.. అయితే ఈ గ్యాప్ మళ్ళీ తీసేసి ఒక్కటి అవ్వబోతున్నారా ? ఈ విషయం పై సోషల్ మీడియాలో గట్టి వాదన జరుగుతుంది. పవన్ ప్రజెంట్ నటిస్తున్న ఓజి సినిమాలో అలీ నటించనున్నట్టు టాక్ వినిపిస్తుంది.. ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ జులైలో స్టార్ట్ కాబోతుంది. ఈ షెడ్యూల్ లో అలీ జాయిన్ కానున్నారని.. పవన్, అలీ మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్టు సమాచారం. చూడాలి ఈ వార్తలో నిజమెంత ఉందో..