Purandeshwari :
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియామకమయ్యాక నిన్న తొలిసారిగా రాష్ర్టానికి చేరుకున్నారు. ఆమెకు శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. అయితే అందరినీ కలుపుకొని ఆమె ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు తో పాటు మిగతా నేతలంతా ఉన్నారు. గతంలో టీడీపీ నుంచి చేరిన నేతలతో పాటు మిగతా నేతలు కూడా ఆమెకు ఘన స్వాగతం పలికారు. అయితే రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని వెళ్తానని ఇది వరకే ఆమె ప్రకటించారు. అయితే ఆమె నిర్వహించిన సమావేశంలో బీజేపీ లో ఉన్న మూడు, నాలుగు వర్గాల నేతలందరినీ పిలిచారు. అందరినీ కలుపుకొని వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఆమెకు ముందున్నది మొత్తం పరీక్షా కాలమే. ఈ సమయంలోనే పొత్తుల ఆంశం తెరపైకి వస్తున్నది.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమని ఇప్పటివరకు అన్ని వర్గాల నుంచి టాక్ వస్తున్నది. టీడీపీ నుంచి బీజేపీ నేతలైతే ఒకడుగు ముందుకేసి, పొత్తు ఖాయమైందని అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నదని మీడియాకు ప్రకటనలిచ్చేస్తున్నారు. అయితే బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న పురుందేశ్వరీ మాత్రం ఇప్పటివరకు కేవలం జనసేనతో మాత్రమే పొత్తు ఖరారైందని తాజా గా ప్రకటించారు. భవిష్యత్ లో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ వైపు ఆమె నిలబడుతుందా.. లేదంటే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతితో వెళ్తుందా వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఆమె టీడీపీతో పొత్తు అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గుబాటి కుటుంబం కొంత అంటిముట్లనట్లుగానే ఉన్నది. ఇటీవల ఇరు కుటుంబాలు కొంత దగ్గరైనట్లుగా కనిపిస్తున్నది. అయితే అది కేవలం కుటుంబం వరకేనా.. రాజకీయాల్లో కూడా సయోధ్య తో కలిసి నడుస్తారా అనేది త్వరలోనే తేలనుంది. ఏదేమైనా ఇక ఏపీ బీజేపీలో ప్రస్తుతం తన సొంత టీం ఏర్పాటు చేసుకునే పనిలో పురందేశ్వరి ఉన్నారు. ఆ తర్వాతే పార్టీ అధిష్టానం తో మాట్లాడి ఆమె ఒక స్టాండ్ తీసుకోనున్నారు. మరి అధికార వైసీపీ పై మాత్రం కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. అవి కంటిన్యూ .. చేస్తారా లేదా అనేది తొందర్లోనే తేలనుంది.