Purandeshwari : ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఏ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లినా.. పొత్తుల కోసమే అనే చర్చ సాగుతోంది.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుసగా హస్తిన పర్యటనకు వెళ్లారు. చంద్రబాబు,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వస్తే.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. ప్రధాని మోడీ, అమిత్‌షా, నిర్మలా సీతారామన్ లాంటి వారిని కలిసి వచ్చారు..
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టలపై విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ రెండు పర్యటనల వెనుక.. రాజకీయాలు ఉన్నాయనే చర్చే సాగుతూ వచ్చింది.. మరోవైపు.. నేడు ఏపీ బీజేపీ అధ్యక్షు రాలు దగ్గుబాటి పురంధేశ్వరి సహా ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ సదస్సులో పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు.. ఇక, బీజేపీ పెద్దలతో ప్రత్యేకంగా పురంధేశ్వరి సమావేశం కాబోతు న్నారు. పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై హైక మాండ్ తో ఏపీ బీజేపీ చీఫ్ చర్చిస్తారని తెలుస్తోంది.. పో టీకి అవకాశం ఉన్న నియోజకవర్గాల జాబితా ను ఢిల్లీ పెద్దలకు అందించనున్నారట చిన్నమ్మ.. ఆశావహుల జాబితాను ఢిల్లీ పెద్దల ముందు ఉంచి..
తమ ఓట్ షేర్‌తో పాటు.. పొత్తులతో కలిసివచ్చే అవకాశాలపై కూడా చర్చిస్తారనే ప్రచారం సాగు తోంది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. ఆ తర్వాత టీడీపీ-జనసేన మధ్య స్నేహం చిగురించింది.. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లే విషయాలపై చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ అగ్రనాయ త్వంతో చంద్రబాబు చర్చించి వచ్చారు. ఇక, త్వరలో పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.