36.7 C
India
Thursday, May 16, 2024
More

    Margadarsi Chit Fund : మార్గదర్శి ని వెంటాడుతున్న ఏపీ సీఐడీ..

    Date:

    Margadarsi Chit Fund :
    ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్ పై ఏపీ సీఐడీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏం లేకున్నా ఏదో ఉన్నట్లు ప్రచారం చేసి మార్గదర్శిని దెబ్బతీయాలనే కుట్ర తప్పితే ఏం కనిపించడం లేదు. మార్గదర్శి చిట్ ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జగన్ ప్రభుత్వం మార్గదర్శిపై పడిందని, ఈనాడు ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టాలనే కసి తప్ప వేరే ఏం కనిపించడం లేదనేది బహిరంగమే.
    చిట్స్ వేసి పాడుకుని.. డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టిన వారిని తీసుకొచ్చి.. మార్గదర్శి మోసం చేసిందని కేసులు పెట్టిస్తున్నారు సీఐడీ అధికారులు. గతంలో ఓ సారి తప్పుడు ఫిర్యాదు తీసుకుని … విజయవాడ పోలీస్ కమిషనర్ ఏకంగా తన ఆఫీసులోనే ఫిర్యాదు దారుడ్ని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టగా కోర్టు షాక్ ఇచ్చిది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే  సీఐడీ కూడా అదే బాటలో వెళ్తున్నది. ఓ మహిళను తీసుకొచ్చి ఆమె ఫిర్యాదు చేసినట్లు చెప్పి కేసు పెట్టారు. ఆమె ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు చూస్తే.. మార్గదర్శిది తప్పేమీ లేదని.. అందరికీ స్పష్టమవుతున్నది. సీఐడీ కుట్ర చేస్తున్నదనే విషయం ఆమె మాటల్లో అవగతమవుతున్నది. అన్న పూర్ణ అనే మహిళ పౌల్ట్రీ ఫాం వ్యాపారం చేస్తున్నది.
     మొదట్లో ఆమె తన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా చిట్స్ వేశారు. తర్వాత ఇష్టం వచ్చినట్లుగా చిట్స్ వేశారు. డబ్బులు కట్టలేక 17 చిట్స్ లో డీఫాల్ట్ అయ్యారు. చిట్స్ పాడుకున్న తర్వాత ష్యూరిటీలు ఇచ్చి నగదు తీసుకున్నారు. కానీ కట్టడం మానేశారు. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి ఆమె చేతులెత్తేయడంతో ష్యూరిటీ సంతకాలు పెట్టిన వారి దగ్గర నుంచి వసూలు చేశారు. ఈ విషయాన్ని కూడా ఆమె వివరించింది. దీనిని కూడా సీఐడీ అధికారులు వక్రీకరిస్తున్నారు. ఆమె కుమార్తె సంతకాలు ఫోర్జరీ చేసి.. చిట్ పాడారని.. ఆమె విదేశాల్లో ఉందని ఇలాంటి కబుర్లు చెబుతున్నారు. అందుకే కేసులు పెట్టామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చిట్ వ్యవహారాల్లో డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టిన విషయం ఆమె స్వయంగా చెబుతున్నా దానిని మార్గదర్శి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.  ఒక వ్యక్తి తాను తీసుకున్న డబ్బులు కట్టలేదని స్వయంగా వారే చెబుతుండగా, అందుకు మార్గదర్శే కారణమని  పోలీసులు వక్రీకరించడం ఎందుకో వారికే తెలియాలి. ఏదో విధంగా తప్పుడు ప్రచారాలు, ఫిర్యాదు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి రాచమర్యాదలు చేయడం సాధారణమైపోయింది. ఇదే ప్రెస్ మీట్లో చాలా ఆరోపణలు చేశారు సీఐడీ సంజయ్. వాటిని ఎందుకు కోర్టు ముందు పెట్టలేకపోతున్నారో మాత్రం చెప్పడానికి ఆయనకు ధైర్యం చాలడం లేదు.

    Share post:

    More like this
    Related

    Arunachal Pradesh : బాలికలతో వ్యభిచారం.. అరెస్టయిన వారిలో ప్రభుత్వ అధికారులు

    Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్...

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్‌, వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు సీఐడీ షాక్!

    Sajjala Bhargav : ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో,...

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    AP CID Vs Chandrababu : చంద్రబాబుపై మరో కేసు పెట్టిన సీఐడీ

    AP CID Vs Chandrababu : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై...

    Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు షాక్..

    Chandrababu : చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్...