Chiranjeevi మెగాస్టార్ చిరంజీవికు 9 ఏళ్ల తర్వాత హైకోర్టులో ఊరట లభించింది. అసలు చిరంజీవిపై కేసు ఉండడం ఏంటి? ఇన్నాళ్లకు ఆ కేసు కొట్టేయడం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును చిరంజీవి కాంగ్రెస్ లో ఉండగా 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈయనపై కేసు పెట్టారు.. ఏపీ హైకోర్టు ఇప్పుడు ఈ కేసును కొట్టేసింది.
9 ఏళ్ల క్రితం గుంటూరు, అరండల్ పేట పోలీసులు ఈ కేసును నమోదు చేసారు.. ఈ కేసు ఇప్పుడు హైకోర్టు కొట్టివేసింది.. ఎఫ్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపి వేసింది.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అప్పుడు ఈయన ఎన్నికల నియమం ఉల్లఘించారని రాత్రి 10 గంటల తర్వాత ప్రచారం నిర్వహించకూడదు అనే నియమం ఉన్నా కూడా లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించారని ట్రాఫిక్ అంతరాయం కలిగించారని అప్పటి కాంగ్రెస్ నేత చిరంజీవిపై గుంటూరు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసారు..
ఈ కేసుపై విచారణ జరుగుతుంది.. అదే సమయంలో చిరంజీవి కేసును కొట్టివేయాలని, రైల్వే కోర్టులో విచారణ ప్రక్రియ వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించగా నిన్న విచారణ జరగగా మెగాస్టార్ తరపున న్యాయవాది ఆయన వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.. ప్రస్తుతం మెగాస్టార్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నారు.