![](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/09/samayam-telugu-102112559.webp)
అరియానా గ్లోరీ బిగ్ బాస్ తోనే బాగా ఫేమస్అ యింది. అంతకు ముందు ఆమె ఎవరికీ పెద్దగా తెలియదు. అంతకు ముందు కొన్ని చిన్న ఛానెళ్లలో యాంకరింగ్ చేసింది. కానీ అప్పుడు ఫేమస్ కాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. తర్వాత వరుసగా స్టార్ మాలోనే అవకాశాలు అందుకుంది.
చివరగా ఆమె బీబీ జోడీలో పాల్గొంది. ఆ తర్వాత బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఫస్ట్ లవ్ గురించి యాంకర్ ప్రశ్నించింది. ఆమె మాట్లాడుతూ.. తన సీక్రెట్స్ మొత్తం చెప్పేసింది. నాకు ఫస్ట్ లవ్ మా బావనే. నాకు చిన్నప్పటి నుంచి ఎంతో హెల్ప్ చేశాడు. అందుకే అతనిపై ఇష్టం పెంచుకున్నాను.
నాకు 18 ఏళ్లు వచ్చినప్పుడు మా బావకు జాబ్ వచ్చింది. అతనితో పాటు నేను కూడా హైదరాబాద్ కు వచ్చాను. ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్లం. నేను కాలేజీకి వెళ్లి చదువుకునే దాన్ని. కానీ మా బావ జాబ్ చేసేవాడు. మూడేళ్లు ఒకే రూమ్ లో ఉన్నాం. కానీ మా బావ నన్ను మోసం చేశాడు. వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండేవాడు.
అందుకే అతనితో బ్రేకప్ అయింది.కానీ ఇప్పటికీ మా బావ అంటే ఇష్టం అంటూ తన సీక్రెట్స్ మొత్తం చెప్పేసింది. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై మళ్లీ ఏదైనా షోలో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. కాకపోతే స్టార్ మాలోనే చేస్తుందా లేక ఏదైనా వేరే ఛానెల్ కు వెళ్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మరి అరియానా కోరుకున్నట్టు ఆమె బావ ఆమెకు దగ్గరవుతాడా లేదా అనేది చూడాలి.
ReplyForward
|