Ashu Reddy Recent Photos :
అందాలను ప్రదర్శించడంలో అషురెడ్డి ఎప్పుడూ ముందే ఉంటుంది. రాంగోపాల్ వర్మతో ఏకంగా కాళ్లు పట్టించకున్న ఈ భామ తన గ్లామర్ తో ఎప్పడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. పాపం రీసెంట్ గా ఈ పాప డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది. కేపీ చౌదరి ఇటీవల భారీ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె ఫోన్ నెంబర్, వివరాలు కేపీ చౌదరి వద్ద లభించాయి. దీంతో ఆమె ఈ వివాదంలో పీకల్లోతు ఇరుక్కపోయిందనే చెప్పాలి.
కేపీ చౌదరి కాంటాక్ట్ లిస్ట్ లో అషురెడ్డి ఫోన్ నెంబర్ ఉండడమే కాదు.. పట్టుబడేందుకు ముందు చాలా సార్లు ఆయన అషుకు ఫోన్ చేసినట్లు సాక్షాలు కూడా లభించాయి. అయితే డ్రగ్స్ విషయంపైనా లేక మరే పనైనా అనేది పూర్తిగా తెలియలేదు. ఈమెతో పాటు మరో ఇద్దరు నటులు సురేఖా వాణి, జ్యోతి కూడా కూరుకుపోయారు.
ఈ కేసులో తన ఫోన్ నెంబర్ రిలీజ్ చేయడంపై అషు స్పందించింది. కొన్ని మీడియా సంస్థలపై తీవ్రంగా మండిపడింది. డైరెక్ట్ గా తన ఫోన్ నెంబర్ బహిర్గతం చేయడం వలన తాను డిస్ట్రబ్ అయ్యానని, చాలా మంది ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆమె చెప్పుకచ్చింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబందం లేదని చెప్తుంది.
వర్మ ఇంటర్వ్యూలు, బోల్డ్ ఫొటో షూట్లతో కొంత నెగెటివిటీని వెనకేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు డ్రగ్స్ కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆమె వీటిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఎప్పటిలాగే తన గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ తనపై నుంచి చూపు వెళ్లకుండా చూసుకుంటున్నారు.
ఇక ఫారన్ వీధుల్లో అందాల దుకాణం తెరిచింది ఈ చిన్నది. అక్కడ దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ఆమె మొదటి నుంచి సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయ్యారు. మొదట జూనియర్ సమంతాలా ఫోజులిస్తూ టిక్ టాక్ వీడియోలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 3 కూడా ఆమెకు కొంత ఫేమ్ తెచ్చింది. ప్రస్తుతం బుల్లితెర షోలలో అషు సందడి చేస్తుంది.