Horoscope Today:
మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రమ పెరుగుతుంది. తొందరపాటు వద్దు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తే మంచి జరుగుతుంది.
వ్రషభ రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. కార్యానుకూలత ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళతారు. ఇష్టదేవత స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి పనుల్లో శ్రమ ఎక్కువవుతుంది. కొందరు మనకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. దుర్గాదేవి అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
కర్కాటక రాశి వారికి మంచి కాలం. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకుంటారు. గణపతి ఆరాధన చేయడం మంచిది.
సింహ రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దుర్గా అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి వారికి మంచి కాలం. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. చేపట్టే పనుల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. శివ నామ స్మరణ చేయడం వల్ల మంచి జరుగుతుంది.
తుల రాశి వారికి ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. సూర్యాష్టకం చదివితే మంచిది.
వ్రశ్చిక రాశి వారికి మంచి వాతావరణం ఉంటుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రధానమైన పనుల్లో ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గొడవలకు పోవద్దు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. శని శ్లోకం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.
మకర రాశి వారికి ఒక వార్త సంతోషాన్ని నింపుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీ నిజాయితీయే మీకు రక్షణగా నిలుస్తుంది. శ్రీరామ నామం జపించడం వల్ల మేలు చేస్తుంది.
కుంభ రాశి వారికి ఉల్లాసం కలుగుతుంది. ఉత్సాహంగా ముందుకు వెళతారు. ఇష్టదేవత ఆరాధన వల్ల శుభ ఫలితాలు వస్తాయి.
మీన రాశి వారికి మీ రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. ఒక వార్త మీకు ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే శుభం కలుగుతుంది.