29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.
వ్రషభ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. విష్ణు సహస్ర నామాలు చదువుకోవడం ఉత్తమం.
మిథున రాశి వారికి ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. దుర్గాధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనోబలం ఇనుమడిస్తుంది. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవి దర్శనం మంచి చేస్తుంది.
సింహ రాశి వారికి పట్టుదలగా ఉంటారు. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. అనవసర విషయాల జోలికి వెళ్లకండి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కన్య రాశి వారికి ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల మంచి జరుగుతుంది.
తుల రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఆంజనేయ స్వామి స్తోత్రం చదవడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.
వ్రశ్చిక రాశి వారికి మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవడం మంచిది.
ధనస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకోండి. గోసేవ చేయడం చాలా మంచిది.
మకర రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. సమయం ప్రకారం నడుచుకోండి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభకరం.
కుంభ రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. మంచి ఫలితాలు వస్తాయి. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది.
మీన రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆచితూచి వ్యవహరించాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది.