
Eating Dondakaya : మనకు ప్రకృతి సిద్ధంగా దొరికే కూరగాయల్లో దొండకాయ ఒకటి. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. చూడటానికి పొట్టిగా ఉన్నా ప్రొటీన్లలో మెండు. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. దొండకాయల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల మనకు మేలు కలిగిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియాలను అడ్డుకుంటాయి. ఆయుర్వేదంలో దీనికి ప్రాముఖ్యత ఉండటం వల్ల పలు మందుల్లో దీన్ని వాడతారు. దొండకాయ తింటే మందబుద్ధి కలుగుతుందని చెబుతుంటారు ఇది అపోహే. ఇందులో నిజం లేదు.
ఇందులో ఉండే యాటీ హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీలను దూరం చేస్తాయి. ఆకలి మందగిస్తే దానికి తగిన పరిష్కారం చూపుతాయి. సి విటమిన్ వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. మానసిక ఆందోళన, మూర్చ సంబంధమైన సమస్యలతో బాధపడే వారికి ఇది చక్కని మందు అవుతుంది. ఇందులో ఉండే కాల్షియం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా చేస్తాయి.
డయాబెటిస్ వారికి మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. దొండకాయలను తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరగకుండా నిరోధిస్తుంది. ఫైబర్ ఉండటం వల్ల మంచి కొవ్వు, ప్రొటీన్లకు ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. దొండకాయ తినడం వల్లచాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయి. ప్రశాంతతను కలిగిస్తాయి. డిప్రెషన్ ను దూరం చేస్తాయి.
దొండకాయ కూర చేసుకోవచ్చు. ఫ్రైగా వండుకోవచ్చు. పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఎలా తిన్నా దీంతో మనకు చాలా రకాల మేలు కలిగిస్తాయి. ఆయుర్వేదంలో దీనికి మంచి విలువ ఇస్తారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపించే దొండకాయలు ఆరోగ్యానికి మెండు. అందుకే వీటిని తరచుగా తీసుకుని మన ఆరో గ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.