25.2 C
India
Saturday, June 22, 2024
More

    Eluru District : వైసీపీ గెలుస్తుందని పందెం.. రూ.30 కోట్లు చెల్లించలేక ఆత్మహత్య

    Date:

    Eluru District
    Eluru District

    Eluru District : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని సుమారు రూ.30 కోట్ల పందెం వేసి తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో ఆదివారం జరిగింది.

    పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచి. వీరు వైసిపి మద్దతుదారులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని వేణుగోపాలరెడ్డి వివిధ గ్రామాలకు చెందినవారితో సుమారు రూ.30 కోట్ల వరకు పందెం వేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడం.. గ్రామంలో లేకపోవడంతో ఈ నెల 7న పందెం వేసినవారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు, తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు.

    ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగుమందు తాగారు. మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్లు మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan and Jagan : బద్ధ శత్రువులు కలిసిన వేళ..జగన్-పవన్ కలయిక వైరల్

    Pawan Kalyan and Jagan : జనసైనికులకు, మెగాభిమానులకు జూన్ 21 కలకాలం...

    YS Sharmila : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: వైఎస్ షర్మిల

    YS Sharmila : డాక్టర్లు అవుదామని ఆశతో ఉన్న 24 లక్షల...

    CM Chandrababu : యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి...

    Ex CM Jagan : అసెంబ్లీలో జగన్ కు ర్యాగింగ్ మొదలు.. ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం ఏం చేశారంటే?

    Ex CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఊహించని పదవులు..

    Pawan Kalyan : ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు...

    YSRCP : గెలిస్తే సక్రమం.. ఓడితే అక్రమం.. ఇది వైసీపీ తీర్పు 

    YSRCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో అసెంబ్లీ ఎన్నికలు...

    Pawan Kalyan-Balayya : పవన్ కు బాలయ్యకు ఎవరికీ మెజార్టీ ఎక్కువో..

    Pawan Kalyan-Balayya : పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మార్గాని భరత్, లోకేశ్...

    Aaraa Mastan : ‘ఆరా మస్తాన్’ గుడివాడను దాటవేయంలో ఉద్దేశం ఇదేనా?

    Aaraa Mastan : జూన్ 1న చివరి దశ పోలింగ్ ముగిసిన...