
Bhola Shankar Teaser : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా భోళా శంకర్. ఇది క్రియేటివ్ కమర్షియల్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థల పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు అందుకుంటోంది.
సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ నెల 24న విడుదల చేస్తున్నట్లు చెబుతున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఆగస్టు 11న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భోళా శంకర్ పై అందరికి ఆతృత నెలకొంది.
పెద్ద దర్శకులతో చేసేందుకు మెగాస్టార్ చొరవ చూపడం లేదు. అందుకే చిన్న వారితోనే సినిమాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగానే సినిమాల ఎంపిక ఉంటోంది. సినిమాల సక్సెస్ కు కష్టపడి పనిచేసే వారికే పట్టం కడుతున్నారు. దీంతోనే సినిమాల ఎంపికలో ప్రాధాన్యం చూపుతున్నారు. విజయవంతం అయ్యే వాటినే ఎంచుకుంటున్నారు.
ఇప్పుడు మెగా వారసురాలు రావడంతో ఆమె రాకతో మెగా కుటుంబంలో సందడి నెలకొంటున్నా ఇప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సిందే. మెగా అభిమానులు కూడా భోళా శంకర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు టీజర్ విడుదల డేట్ ఫిక్స్ కావడంతో సందడి ఏర్పడింది. జూన్ 24 కోసం ఎదురు చూస్తున్నారు. టీజర్ తో సినిమా భవితవ్యం బయట పడనుంది.