Bhola shankar : మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్లగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.. ఈయన పదేళ్లకు పైగానే సినిమాలకు దూరం అయ్యి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన కూడా ఈయనకు ఇదే ఆదరణ లభిస్తుంది.. మెగా ఫ్యాన్స్ ఈయన సినిమాలపై భారీ హోప్స్ పెట్టుకుంటున్నారు. అయితే ఇటీవలే ఈయన ఎంచుకునే రీమేక్స్ కారణంగా ఈయనకు ప్లాప్స్ వస్తున్నాయి..
మెగా ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ గా ఉన్న ఈ రీమేక్ సినిమాలు తెలుగులో తెరకెక్కించి రిలీజ్ చేస్తే ఒకటి రెండు రోజుల మినహా ప్రభావం చూపించలేక పోతున్నాయి.. మరి వరుస రీమేక్ లతో ఫ్యాన్స్ సైతం విసిగి పోతున్నారు.. మరి తాజాగా మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు నిన్న వచ్చాడు.. ఆగస్టు 11న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తొలి రోజు సైతం పెద్దగా హౌస్ ఫుల్ కనిపించలేదు.. చిత్ర యూనిట్ సైలెన్స్ కూడా ఇది నిజమే అని చెప్పకనే చెబుతుంది.. రీమేక్ వర్కౌట్ కాదు అని ఇప్పటికే చాలా సినిమాల్లో నిరూపితం అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ మెగా హీరోలు రీమేక్ సినిమాలనే చేస్తున్నారు.
అయితే ఇలాంటి ప్లాప్ సినిమా కథను ముందుగా ఒక స్టార్ హీరో దగ్గరికి వెళ్లిందట.. సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి ఈ రీమేక్ వెళ్లగా ఈయన తప్పించుకోలేక మెగాస్టార్ అయితే బాగుంటుంది అని చెప్పారట.. దీంతో మహేష్ చెప్పడంతో మెహర్ కు మెగాస్టార్ ఓకే చెప్పారట.. మొత్తానికి మహేష్ తెలివిగా తప్పించుకోగా మెగాస్టార్ బలయ్యాడు అనే చెప్పాలి..