Chiranjeevi :
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి భోళా శంకర్ ఈ వీకెండ్ లో బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు. స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా తెరకెక్కింది..
తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.. ఈ క్రమంలోనే నిన్న రాత్రి భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించగా ఈ వేదికపై చిరంజీవి బావోద్వేగంగా ప్రసంగించారు.
అమ్మ ప్రేమ ఎలా బోర్ కొట్టదో అభిమానుల ప్రేమ కూడా ఎప్పుడు తరగదు.. ఇలాంటి గొప్ప జన్మ ఇచ్చినందుకు నేను భగవంతుడికి ధన్యవాదములు తెలుపుకుంటాను.. నా అభిమానులు నన్ను చూసి ఎప్పుడు గర్వపడేలా నన్ను నేను మార్చుకుంటూనే ఉంటాను.. ఇక నా అభిమానుల్లో యూత్ కూడా ఉండడం చాలా హ్యాపీగా ఉంది..
ఇక భోళా శంకర్ సినిమాను నాకు నచ్చి చేశాను.. మీకు కూడా నచ్చేలా చేశాను.. తప్పకుండ మిమ్మల్ని భోళా శంకర్ అలరిస్తుంది.. ఇక రీమేక్ గురించి మాట్లాడితే ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇచ్చేందుకు చేసే ప్రయత్నం ఎందుకు నచ్చదో తెలియదు.. వేదాళం అన్ని ప్లాట్ ఫామ్ లలో లేదు అని చెప్పిన తర్వాతనే నేను ఈ సినిమాను చేశాను అంటూ చిరు చెప్పుకొచ్చారు.. చూడాలి ఈ సినిమా ఎలా అలరిస్తుందో..
కాగా ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.. ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ReplyForward
|