32.6 C
India
Saturday, May 18, 2024
More

    Congress Winning Mantra : కాంగ్రెస్ ‘గెలుపు’ మంత్రం.. వారిద్దరే కీలకమా..?

    Date:

    Congress Winning Mantra
    Congress Winning Mantra

    Congress Winning Mantra : తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి విజయం కోసం సీరియస్ గా శ్రమిస్తున్నాయి. మరోవైపు పార్టీలో సీనియర్లు కూడా ప్రస్తుతానికి వర్గపోరు పక్కన పెట్టి ఐక్యంగా శ్రమిస్తున్నారు. పార్టీని ఈసారి అధికారంలోకి తేవడానికి కృషి చేస్తున్నారు. పార్టీలోని అన్ని నియోజకవర్గాల మీద అధిష్టానం వద్ద రెండు, మూడు రిపోర్టులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి టీపీసీసీ చీఫ్ రేంత్ రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు మంచి వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎక్కడికక్కడా శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

    ఇక తెలంగాణలో కాంగ్రెస్ గె భారత పోలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిటిక్ సంస్థ పేర్కొంది. ప్రజల నాడి పట్టేందుకు ఈ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించినట్లు సమాచారం. అధికార బీఆర్ఎస్ 40 స్థానాలు, కాంగ్రెస్ 72 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. బీజేపీ 2, ఎంఐఎం 5 స్థానాల్లో గెలుపు ఖాయమని చెప్పింది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే ఖమ్మంలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని స్పష్టం చేసింది.

    ఆదిలాబాద్ జిల్లాలో పది స్థానాలకు 9 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తాయని స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్ లో 15 సీట్లు ఉంటే 5 కాంగ్రెస్, 5 ఎంఐఎం, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ గెలుస్తుందని పేర్కొంది. ఇక కరీంనగర్ లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 4, బీజేపీ 1 గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. మహబూబ్ నగర్ లో 14 స్థానాలకు గాను కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 7 గెలుచుకుంటుందని తెలిపింది. మెదక్ లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 7 సీట్లలో గెలుస్తాయని చెప్పింది.

    నల్గొండలో 12 స్థానాలకు గాను కాంగ్రెస్ కు 9, బీఆర్ఎస్ కు 3 వస్తాయని సర్వేలో తెలిపింది.  నిజామాబాద్ లో 9 స్థానాల్లో సర్వే చేయగా కాంగ్రెస్ కు 5, బీఆర్ఎస్ కు 4 వస్తాయని చెప్పింది.  రంగారెడ్డిలో బీఆర్ఎస్ కు 8 కాంగ్రెస్ కు 6, వరంగల్ లో కాంగ్రెస్ కు 8, బీఆర్ఎస్ కు 4 వస్తాయని స్పష్టం చేసింది.

    అయితే కాంగ్రెస్ ఈ జోరు మీద ఎన్నికల్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఇద్దరు వ్యక్తులే అనే అభిప్రాయం వినిపిస్తున్నది. పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సీనియర్లు కూడా ప్రస్తుతానికి ఆయనకు సహకరిస్తున్నారు. మరోవైపు సునీల్ కనుగోలు టీం ఎప్పటికప్పుడూ అవసరమైన సలహాలు, పార్టీ వీక్ గా ఉన్న ప్రాంతాలపై ఆయన సలహాలు అందిస్తున్నారు. ఇప్పటికే 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ కాగా, రెండో లిస్ట్ రేపో, మాపో విడుదల కానుంది. ఇక రాష్ర్టంలో పలువురు మంత్రుల ఓటమి ఖాయమనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Revanth Reddy : తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డితో అవుతుందా?

    CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది....