Ramgopal Varma : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక ప్రకటన చేశారు. తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటన చేశారు.
ఇది తాను సడన్ గా తీసుకున్న నిర్ణయం అని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో పవన్ అంటే రాంగోపాల్ వర్మ కు ఎందుకంత పగ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద జనసేన ని పోటీ చేసే నియోజకవర్గం పై రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవై పు టిడిపి నేతలు ఆయన పోటీని వ్యతిరేకిస్తూ జెండాలు ఫర్నిచర్ ధ్వంసం చేస్తుంటే మరోవైపు రాంగోపాల్ వర్మ ఆ నియోజకవర్గంలో నేను కూడా బరిలో ఉంటానని ప్రకటించడంతో గందరగోళం నెలకొంది.