33.2 C
India
Sunday, May 19, 2024
More

    RGV VYOOHAM Movie Story : వర్మ ‘వ్యూహం’ వెనుక అసలు కథేంటి..?

    Date:

    RGV VYOOHAM Movie Story
    RGV VYOOHAM Movie Story

    RGV VYOOHAM Movie Story : రామ్ గోపాల్ వర్మ. విభిన్న శైలి.. విచిత్ర ప్రవర్తన.. డిఫరెంట్ మెంటాలిటీ కలగలిపిన డైరెక్టర్.  ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమా వ్యూహం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్.  విడుదలకు ముందే ఎన్నో సంచలనాలకు ఈ సినిమా కేంద్రబిందువైంది. వివాదాస్పద సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మకు సాటివచ్చే దర్శకులు ఎవరూ లేరు. శివ నుంచి మొదలైన ఆయన ప్రస్థాన్ అండర్ వరల్డ్ మాఫియా చిత్రాలు తీసి, ఆ తర్వాత అశ్లీలత కలబోసిన చిత్రాల వరకు వెళ్లింది. ఆయన తీసిన రక్త చరిత్ర సినిమా సంచలనమైంది.

    అయితే వివాదాస్పద విషయాలతో, టాపిక్ లతో పాత్రలు కల్పితం అంటూ వర్మ డిఫరెంట్ సినిమాలు తీస్తుంటాడు. ఆయన పద్ధతి మొత్తం ‘నా ఇష్టం’ అన్నట్లే ఉంటుంది. అయితే వర్మ ప్రస్తుం ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా ఉంటున్నారు, ఇటీవల కూడా ఆయనను రెండుసార్లు కలిశారు. ఇప్పుడు తీసిన వ్యూహం సినిమా కూడా జగన్ కుటుంబానికి సంబంధించినదే అనే టాక్ వినిపిస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలను వెలికితీస్తూ ఈ సినిమా ఉంటుందనేది టాక్. 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనంగా మారిన ఆర్జీవీ, 2024 ఎన్నికలకు ముందు వ్యూహం సినిమాతో ముందుకు వస్తున్నారు. ఇందులో రాజకీయ పరమైన అంశాలను ఆయన తీశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ సినిమా వస్తున్నట్లు టాక్.

    వ్యూహానికి రెండో భాగంగా శపథం అనే సినిమా రాబోతున్నదని తెలుస్తున్నది. ఇప్పటికే విడుదలైన వ్యూహం టీజర్ సంచలనంగా మారింది. వైఎస్సార్ మరణం, జగన్ పార్టీ పెట్టడంలాంటి విషయాలను ఇందులో చిత్రీకరించారు. వివాదాస్పద అంశాలతో సినిమాలు తీయడం అలవాటు చేసుకున్న ఆర్జీవీ, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఇలాంటి సినిమాలు తీస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు చంద్రబాబును సినిమా ద్వారా బద్నాం చేసిన ఆర్జీవీ మరోసారి అదే ప్రయత్నానానికి తెరలేపారు. వర్మ వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ వెనుక జగన్ ను మరోసారి గద్దెనెక్కించాలనే ప్రయత్నమే తప్పా మరెలాంటి సీన్లు ఈ సినిమాలు ఉండబోవని టాక్ వినిపిస్తున్నది. ఏదేమైనా వివాదస్పద డైరెక్టర్ పేరు గాంచిన ఈ ఆర్జీవీ తన ఇష్టాలను జనంపై రుద్దడమేంటోనని పలువురు మండిపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ramgopal Varma : పిఠాపురం నుంచి పోటీ చేస్తా:  రాంగోపాల్ వర్మ

    Ramgopal Varma : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ...

    Barrelakka : ఆర్జీవీపై ఫిర్యాదు చేసిన బర్రెలక్క 

    Barrelakka : కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష...

    RGV Vyuham : బెడిసికొట్టిన వర్మ ‘వ్యూహం’..అట్టర్ ప్లాప్ అయ్యిందిగా!

    RGV Vyuham : శివ, రంగీలా, సత్య, సర్కార్.. వంటి సినిమాలు...

    RGV : సీన్ లోకి ఎంటర్ అయిన ఆర్జీవీ.. సిస్టర్ అంటూనే పూనమ్ కౌర్ కు ఇచ్చిపడేసిన వర్మ.. 

    RGV పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్...