26.7 C
India
Saturday, June 29, 2024
More

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాను టీ 20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయొద్దని రోహిత్ చెప్పాడా..?

    Date:

    Hardik Pandya
    Hardik Pandya and Rohit Sharma

    Hardik Pandya : రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యాల మధ్య వివాదం ముదురుతూనే ఉంది. ముంబయి కెప్టెన్సీని రోహిత్ శర్మ నుంచి లాగేసుకున్న హర్ధిక్ పాండ్యా పై హిట్ మ్యాన్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. టీం ఇండియా క్రికెట్ లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ ను కాదని ముంబయి టీం యాజమాన్యం హర్దిక్ కు కెప్టెన్సీ అప్పగించిన విషయం తెలిసిందే.

    అప్పటి నుంచి ఇద్దరి మధ్య అంతర్గతంగా విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. టీ 20 వరల్డ్ కప్ ఎంపిక సమయంలో రోహిత్ శర్మ హర్ధిక్ పాండ్యాను సెలెక్ట్ చేయొద్దంటూ సెలక్టర్లకు సూచించినట్లు ఓ జాతీయ మీడియా వెబ్ సైట్ కథనాలు ప్రచురించింది. చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మలు హర్దిక్ ను తీసుకోకూడదని అన్నారని కానీ టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్  కచ్చితంగా తీసుకోవాల్సిందేనని పట్టుబట్టడంతో తప్పక టీం లోకి తీసుకోవాల్సి వచ్చిందంటా..

    రోహిత్ శర్మ హర్దిక్ ను సెలెక్ట్ చేయొద్దన్న వార్తలో నిజమెంత ఉందో ఇప్పటివరకు ఎవరికీ తెలియకున్నా.. హర్దిక్ పూర్తిగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి జట్టుకు భారంగా ఎందుకు అనే వాదన రోహిత్ వినిపించినట్లు తెలుస్తోంది. కానీ హర్దిక్ ను మించి పేస్ ఆల్ రౌండర్ ఇండియా జట్టుకు లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో అతడిని సెలెక్ట్ చేయాల్సి వచ్చిందని అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలోనే  చెప్పడం గమనార్హం.

    టీం 20 వరల్డ్ కప్ లో ఇండియా క్రికెట్ జట్టు మే 9న పాకిస్థాన్ తో అమెరికాలో మ్యాచ్ ఆడనుంది. ఈ వరల్డ్ కప్ జట్టులో ముంబయి ఇండియన్స్ టీం నుంచి నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఈ సారి ఎలాగైనా పొట్టి వరల్డ్ కప్ కొట్టి టీ 20 మ్యాచ్ లకు  బైబై చెప్పాలని హిట్ మ్యాన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫైనల్ గా హర్దిక్, రోహిత్ శర్మల వివాదం టీం ఇండియా క్రికెట్ లో విబేధాలు రాకుండా ఉంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలు.. ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు తెలంగాణ రాజధాని...

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rohith Sharma : ఎమోషనల్ అయిన రోహిత్ శర్మ.. ఓదార్చిన టీం మెంబర్స్

    Rohith Sharma : టీ 20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్...

    Team India : కంగారెత్తించినా.. చివరకు విజయంతో సెమీస్ కు భారత్

    Team India : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో...

    Rohit Sharma : రోహిత్ శర్మ భీకర ఇన్సింగ్స్.. రికార్డులు బద్దలు

    Rohit Sharma : టీం ఇండియా సూపర్ 8 మ్యాచ్ లో...