Jailor దక్షిణాది సూపర్ స్టార్ ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు రజనీకాంత్ అని. ఆయన స్టైల్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సాధారణ బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయ్యాడంటే అతడి స్టైల్ తోనే అనే విషయం తెలిసిందే. అలా ఎదిగిన రజనీకాంత్ ఇక తిరిగి చూసుకోలేదు. తన సహజనటనతో ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపించి తనదైన దారిలో వెళ్లాడు.
ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే ఆయన సూపర్ స్టార్ గా మారాడు. ఏడు పదుల వయసులో కూడా తనకు ఎదురే లేదని నిరూపిస్తున్నాడు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ ఆగస్టు 10న విడుదల కానుంది. దీంతో సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. గత చిత్రాలు పెద్దగా రాణించకపోవడంతో ఇక ఈ సినిమాపైనే ఆశలు పెంచుకున్నారు.
జైలర్ సినిమాకు రజనీకాంత్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాకే. ప్రస్తుతం రజనీ పారితోషికం అమాంతం పెరిగిపోయింది. జైలర్ సినిమాకు రూ. 110 కోట్లు తీసుకున్నారని సమాచారం. దీంతో రజనీతో సినిమా అంటే నిర్మాతకు వాచిపోవాల్సిందే. అంత భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఒక రజనీకాంతే కావడం గమనార్హం. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో రజనీయే.
జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, రమ్యక్రిష్ణ, తెలుగు నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. సినిమా విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. రజనీ పారితోషికం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంత భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో రజనీయే మొదటి స్థానంలో ఉన్నారు.