28.9 C
India
Monday, May 13, 2024
More

    25 Movies released : 25 సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కటే బాక్సాఫీస్.. ఇంతకీ ఏమైందంటే?

    Date:

    movies
    movies

    25 Movies released :  ఆగస్టులో మొత్తం 25 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్క సినిమా మినహా అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భారీ అంచనాల మధ్య రిలీజైన ‘భోళా శంకర్’, మోస్తరుగా ఎదురుచూసిన ‘గాండీవధారి అర్జున’ రెండూ బాక్సాఫీస్ డిజాస్టర్లుగా నిలిచాయి. మొదటి వారంలో తొమ్మిది సినిమాలు విడుదలయ్యాయి. ఇవన్నీ చెప్పుకోదగ్గ పబ్లిసిటీ కానీ, హైప్ కానీ క్రియేట్ చేయలేదు. క్రికెటర్ ధోనీ నిర్మించిన ఎల్జీఎం అనే డబ్బింగ్ చిత్రం ఓ మోస్తరు అంచనాలున్నప్పటికీ డిజాస్టర్ గానే నిలిచింది.

    వీటితో పాటు పొరపాటు, రాజుగారి కోడి పులావ్, కృష్ణగాడు అంతా ఒక రేంజ్, దిల్ సే, హెబ్బులి, బ్లడ్ అండ్ చాక్లెట్, ప్రియ వంటి సినిమాలు కూడా ఆగస్ట్ లో విడుదలయ్యాయి. ఇవి కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాయి. సూర్య నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ రీరిలీజ్ కావడం తీవ్ర దుమారం రేపింది.

    ఆగస్ట్ రెండో వారంలోకి అడుగుపెడుతూ ‘భోళా శంకర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఆరంభం నుంచి క్లైమాక్స్ వరకు ఏ దశలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో భారీ డిజాస్టర్ కావడమే కాకుండా మెగాస్టార్ ఇమేజ్ ను తీవ్రంగా డ్యామేజ్ చేశాయి.

    ‘భోళా శంకర్’ విడుదలకు ఒక రోజు ముందు రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సీన్ లోకి వచ్చింది. తక్కువ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా సర్ ప్రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ పూర్తి నెలలో అద్భుతమైన హిట్ అందుకుంది ఈ సినిమా అనే చెప్పాలి. థియేటర్లలో నెల రోజులుగా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది.

    మూడో వారంలో భూతాల బంగ్లా, ప్రేమ్ కుమార్, జిలేబీ, మదిలో మది, పిజ్జా-3 వంటి సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్, దర్శకుడు విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ నటించిన జిలేబీ చిత్రాలు ఆకట్టుకున్నాయి. దురదృష్టవశాత్తు, ఆ సమయంలో విడుదలైన ఇతర చిత్రాలతో పాటు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

    మూడో వారంలో ప్రభాస్ పాత సినిమా యోగి రీరిలీజ్ అయింది. రీరిలీజ్ అయినా తర్వాత అభిమానుల్లో మొదట్లో ఉత్సాహాన్ని రేకెత్తించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయింది.

    ఆగస్ట్ ఆఖరుకు వచ్చేసరికి కింగ్ ఆఫ్ కోథా, దక్ష, రెంట్, గాండీవధారి అర్జున, బెదురులంక2012, బాయ్స్ హాస్టల్, ఎం చేస్తున్నావు, నేనేనా వంటి సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో వరుణ్ తేజ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వచ్చిన గాండీవధారి అర్జున డిజాస్టర్ గా నిలిచింది.

    ‘కింగ్ ఆఫ్ కొథ’ ద్వారా తన మాస్ ఇమేజ్ ను మార్చుకోవాలని దుల్కర్ సల్మాన్ చేసిన ప్రయత్నం టాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆగస్టులో 25 సినిమాలు థియేటికల్ రిలీజ్ కాగా.. కేవలం డబ్బింగ్ చిత్రం ‘జైలర్’ మాత్రమే చెప్పుకోదగ్గ ప్రభావం చూపించింది. భోళా శంకర్, గాండీవధారి అర్జున చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Box office : 35 కోట్ల బడ్జెట్, 50 కోట్లు కూడా రాలేదా..?  ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే?

    Box office : యానిమల్, జవాన్, పఠాన్, గదర్ 2 లాంటి...

    Tillu Square : ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ దిశగా టిల్లు స్క్వేర్.. ప్రభంజనంగా సిద్ధూ సినిమా..

    Tillu Square : నటీనటులు, సిబ్బందిలో అనేక మార్పులు, జాప్యం తర్వాత...

    Box Office : బాక్సాఫీస్ వద్ద డల్ వీకెండ్.. ఫస్ట్ 5 పై ఓ లుక్కేయండి

    Box Office  Weekend : ఈగల్ : మాస్ మహరాజ్ రవితేజ...

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్...