24.6 C
India
Wednesday, January 15, 2025
More

    Box Office : బాక్సాఫీస్ వద్ద డల్ వీకెండ్.. ఫస్ట్ 5 పై ఓ లుక్కేయండి

    Date:

    Box Office
    Box Office

    Box Office  Weekend : ఈగల్ : మాస్ మహరాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ‘ఈగల్’ ఆకట్టుకునే ఓపెనింగ్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి 2 రోజుల కలెక్షన్లు ప్రోత్సాహకరంగా ఉన్నా.. ఆదివారం భారీగా పడిపోయాయి.

    ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఇండియాలో రూ.18.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో వీక్ డే రన్ ప్రశ్నార్థకమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    యాత్ర 2 : గత చిత్రం ‘యాత్ర’కు సీక్వెల్ గా ‘యాత్ర2’ వచ్చింది. ఈ సినిమాకు మహి వీ రాఘవ్ దర్శకత్వం వహించారు. చిత్రం మొదట్లో పొలిటికల్ మూవీ కోరుకునే వారిని టార్గెట్ చేసినప్పటికీ పేలవమైన పబ్లిసిటీ స్ట్రాటజీతో అందరి దృష్టిని ఆకర్షించడంలో మేకర్స్ విఫలమైనట్లు టాక్.

    ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.5 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు ఫుల్ రన్ పూర్తి చేసుకుంది.

    లాల్ సలాం : రజనీకాంత్ కీలక పాత్రలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్ సలాం’. ఈ చిత్రం తెలుగులో డిజాస్టర్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. తమిళ వెర్షన్ లో ఓపెనింగ్స్ తో కాస్త కలెక్ట్ చేయగలిగినప్పటికీ ఇతర భాషల్లో మాత్రం పర్ఫార్మెన్స్ దయనీయంగా ఉంది. చివరకు వీకెండ్ మొదటి మూడు రోజులు ముగిసేసరికి ఈ సినిమా డొమెస్టిక్ బాక్సాఫీస్ వద్ద రూ.11.45 కోట్లు రాబట్టడం షాకింగ్ గా మారింది. కేవలం తెలుగు వెర్షన్ నే పరిగణనలోకి తీసుకుంటే ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి కేవలం రూ. కోటి మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అని ప్రకటించారు.

    హను-మాన్ : బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఈ సినిమా విడుదలై 31 రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతోంది. 31వ రోజు కూడా దేశ వ్యాప్తంగా రూ.1.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

    ట్రూ లవర్: ఈ సినిమా రాక దాదాపుగా ఎవరికీ తెలియకుండా పోయింది. ఈ చిత్రానికి నిర్మాతలుగా మారుతి, ఎస్‌కేఎన్ వంటి పేర్లు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి. ఓపెనింగ్స్ అంతంతమాత్రంగానే ఉండడంతో ఫస్ట్ వీకెండ్ ముగిసేలోపే ఈ సినిమా థియేట్రికల్ రన్ ను ముగించింది. ప్రభృం వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మణికందన్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : డిప్యూటీ CM గా నారా లోకేష్.. కూటమి సర్కార్ లో వివాదం పొంచి ఉందా?

    Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి....

    Konaseema : కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?

    Konaseema : సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది....

    Brahmani : లోకేశ్ గిఫ్ట్.. రిప్లై ఇచ్చిన బ్రాహ్మణి

    Brahmani : సంక్రాంతి వేళ మంత్రి లోకేశ్ తన భార్య బ్రాహ్మణికి...

    Makara Jyothi : మకర జ్యోతి దర్శనం.. ‘స్వామి’ నామస్మరణతో మార్మోగిన శబరిమల

    Sabharimala Makara Jyothi : సంక్రాంతి పర్వదినం రోజున శబరిమలలో మంగళవారం సాయంత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Box office : 35 కోట్ల బడ్జెట్, 50 కోట్లు కూడా రాలేదా..?  ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే?

    Box office : యానిమల్, జవాన్, పఠాన్, గదర్ 2 లాంటి...

    Tillu Square : ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ దిశగా టిల్లు స్క్వేర్.. ప్రభంజనంగా సిద్ధూ సినిమా..

    Tillu Square : నటీనటులు, సిబ్బందిలో అనేక మార్పులు, జాప్యం తర్వాత...

    25 Movies released : 25 సినిమాలు రిలీజ్ కాగా.. ఒక్కటే బాక్సాఫీస్.. ఇంతకీ ఏమైందంటే?

    25 Movies released :  ఆగస్టులో మొత్తం 25 సినిమాలు విడుదలయ్యాయి....