39 C
India
Sunday, April 27, 2025
More

    Tillu Square : ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ దిశగా టిల్లు స్క్వేర్.. ప్రభంజనంగా సిద్ధూ సినిమా..

    Date:

    Tillu Square
    Tillu Square

    Tillu Square : నటీనటులు, సిబ్బందిలో అనేక మార్పులు, జాప్యం తర్వాత కూడా టిల్లు స్క్వేర్ బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిగా ఎగిరింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సానుకూల సమీక్షలను దక్కించుకుంది.

    టిల్లు ట్రేడ్ మార్క్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అనుపమ గ్లామర్ షో యూత్ ను అట్రాక్ట్ చేసింది. మొత్తంగా డీజే టిల్లు కంటే కూడా టిల్లు స్క్వేర్ భారీ సక్సెస్ సాధించిందని బల్ల గుద్ది చెప్పవచ్చు.

    యునైటెడ్ స్టేట్స్ లో గురువారం ప్రీమియర్లు, శుక్రవారం కలెక్షన్లు రాబట్టిన టిల్లు స్క్వేర్ 1 మిలియన్ డాలర్ల మార్క్ దాటింది. గురువారం ప్రీమియర్లు, శుక్రవారం కలెక్షన్లతో ఈ సినిమా 1, 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. ఇది స్వాగతించదగ్గ విషయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. బోల్డ్ ఫన్, రొమాన్స్ తో నిండిన యూత్ ఫుల్ సినిమా ఈజీగా 2 మిలియన్ మార్కును క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    టిల్లు స్క్వేర్ అనుకున్న సమయానికి రిలీజ్ కాదని మొదట్లో గాసిప్ లు వచ్చినా మేకర్స్ మాత్రం తీవ్రంగా శ్రమించారు. దీంతో అనుకున్న సమయానికి అనుకున్నట్లుగానే రిలీజ్ చేశారు. రిలీజ్ కు ముందు ప్రమోషన్ కూడా దూకుడుగా చేశారు. ఇది సినిమా కలెక్షన్లు చూస్తే అర్థమవుతుంది. పెద్దగా రిలీజ్ లు లేకపోవడం, ఐపీఎల్-2024 కూడా సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపకపోవడంతో డీజే టిల్లు 2 ఓవర్సీస్ మార్కెట్ తో పాటు డొమెస్టిక్ మార్కెట్ లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది.

    Share post:

    More like this
    Related

    Pakistan : పాకిస్తానీలకు భారత్‌లో నేడే డెడ్‌లైన్: ఏం జరుగుతోంది?

    Pakistan : దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీ పౌరులకు నేడు కీలకమైన రోజు. కేంద్ర...

    Mahesh Babu : ఈడీకి హీరో మహేష్‌బాబు సంచలన లేఖ

    Mahesh Babu : ప్రముఖ సినీ నటుడు మహేష్‌బాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు...

    MLAs clash : నడి రోడ్డుపై కూటమి ఎమ్మెల్యేల కొట్లాట.. వైరల్ వీడియో

    MLAs clash : అధికార కూటమిలోని ఇద్దరు కీలక నేతలు, భీమిలి ఎమ్మెల్యే...

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rana Daggubati : రానా దగ్గుబాటి అన్ ఫిల్టర్ డ్ షో.. ఈసారి మరింత కొత్తగా

    Rana Daggubati : టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా కన్నా నిర్మాతగా,...

    Tillu Square : టిల్లు స్క్వేర్ రికార్డును ‘మత్తు వదలరా’ బ్రేక్ చేస్తుందా..?

    Tillu Square : సినీ ఇండస్ట్రీని పరిశీలిస్తే సీక్వెల్ కు సక్సెస్...

    DJ Tillu : డీజే టిల్లుకు.. డబుల్ ఇస్మార్ట్ శంకర్ కు తేడా అదే

    DJ Tillu 2 and Ismart Shankar : పూరీ జగన్నాథ్...

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...