28 C
India
Friday, May 17, 2024
More

    Tulsi story : తులసి కథ తెలుసా? మహా విష్ణువుకు ఎందుకంత ప్రీతికరం

    Date:

    Lord Vishnu
    Lord Vishnu

    Tulsi story ముక్కోటి ఏకాదశి దైవారాధకులకు అత్యంత ప్రీతి పాత్రమైనది. వైఖానసుడనే రాజు తన తండ్రిని నరకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వత్రం నిష్టగా ఆచరించాడట. అతను చేసిన వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి చేరుకున్నాడు. అందుకని ఈ ఏకాదశికి మోక్షద ఏకాదశి అన్న పేరు వచ్చింది.

    ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు.
    కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమలలో శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర మార్గం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకునే భాగ్యంను కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడే ప్రసాదిస్తాడు. ఏకాదశిన తిరుమలలో మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశిన స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాన్ని దర్శించి భక్తులు పుణీతులవుతారు.

    వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. శుచిగా స్నానం ఆచరించి.. పూజగదిని శుభ్రం చేసుకొని అలంకరించాలి. విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, స్వామి వారి ప్రతిమను కొలుచుకోవాలి. పూలతో పాటు హరికి అత్యత ప్రీతికరమైన తులసీ దళాలతో  పూజించుకోవాలి.

    తులసి కథ
    తులసి కేవలం మొక్క మాత్రమే కాదు.. అదొక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవారాధికులు తులసి పూజించకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడి తులాభారం కథ కూడా మనందరికీ తెలిసిందే. ఎంత సంపదతో కొలిచినా స్వామి వారికి సమానం కాదు. కానీ ఒక్క తులసి ఆకుకు మాత్రమే ఆయన లొంగుతాడు. తులసికి అంతటి  విశేషం ఉంది.

    వృందా అనే భక్తురాలే తులసి చెట్లుగా ఆవిర్భవించింది. వృందా కాలనేమి అనే రాక్షసుడి కూతురు. చాలా అందంగా ఉంటుంది. ఆమె ఒక యువరాణి దీంతో పాటు  మహావిష్ణువుకు అత్యంత ఆరాధికురాలు. మహాశువుడి మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధర్. ఇతడు అపార శక్తి మంతుడు. ఇతడు యువరాణి వృందను బాగా ప్రేమిస్తాడు.

    కానీ, వృంద మహావిష్ణువుకు పరమ భక్తురాలు.. జలంధర్ దేవుడిని నమ్మేవాడు కాదు. కానీ విధి నిర్ణయం మేరకు వృందాకు జలంధర్ కు వివాహం జరుగుతుంది. ఆమెతో వివాహం భక్తి, పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది. శివుడిని కూడా ఓడించగలననే మూర్ఖత్వం పెరిగిపోయి శివుడినే ఓడించి విశ్వాధిపతి కావాలనుకుంటాడు. జలంధర్ శక్తులను చూసి దేవతలు కూడా భయపడతారు. ఇంక చేసేది లేక విష్ణువును ప్రార్థిస్తారు. వృంద భక్తురాలు కావడంతో జలంధర్ ను ఎలా హతమార్చాలన్న సందిగ్ధం కలుగుతుంది విష్ణుమూర్తికి. కానీ జలంధర్ వల్ల దేవతలు ఎక్కువగా పీడింపబడుతున్నారు.

    జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు. మహా విష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. ఆమె పాతివ్రత్యం భంగమై జలంధర్ బలహీన పడతాడు. తన తప్పు తెలుసుకున్న మహా భక్తురాలు వృం విష్ణువు నిజరూపాన్ని చూపించాల్సిందిగా కోరుతుంది. తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది.

    తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువును శపిస్తుంది. ఆమె శాపనార్థంతో మహావిష్ణువు గండకి నది సమీపంలో సాలిగ్రామ శిలగా మారుతాడు. ఇక శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు. భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తన జీవితాన్ని ముగించాలనుకుంటుంది.

    వృంద తనువు చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం ఇస్తాడు. ఇందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదనే నానుడి ఉంది. అందుకే ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    financial trouble : ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే ఇలా చేయండి

    financial trouble ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోయాయి. ఎంత సంపాదించినా చేతిలో...

    Bakrid 2023 : వైరల్ పిక్.. బక్రీద్ తర్వాతే.. కిందకు దిగుతాం..!

    Bakrid 2023 : నేడు (జూన్ 29న) హిందువులు ముక్కోటి ఏకాదశిని...

    Ksheera Sagara Madanam : క్షీర సాగర మథనంలో ఏం లభించాయి?

    Ksheera Sagara Madanam : పురాణాల్లో క్షీరసాగర మథనం గురించి మనకు...