BRO పవన్ కల్యాణ్ తన సినిమాల్లో కొత్తదనం చూపిస్తుంటాడు. మేనరిజం ప్రదర్శించడంలో ఆయనది అందెవేసిన చేయి. సినిమాకో వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. తమ్ముడు సినిమాలో కూలీ గెటప్ లో వయ్యారి భామ నీ హంస నడక అంటూ సాగే పాటలో కనిపించి అలరించాడు. ఆ గెటప్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే ఆ గెటప్ అవకాశం వస్తే మళ్లీ వేయాలని చూశాడు. ఆ అవకాశం బ్రో సినిమాలో తిరిగి చూపించాడు. దీంతో ప్రేక్షకులు ఈలలతో గోల చేస్తున్నారు.
ఎర్ర చొక్కా లుంగీ వేసుకుని నోట్లో బీడీ పెట్టుకుని ఊర మాస్ గా బ్రోలో ప్రేక్షకులకు కనువిందు చేశాడు. దీంతో బ్రోలో భగవంతుడిగా కూడా పవన్ తనదైన శైలిలో నటించాడు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతవరకు చూడని పవన్ ను ఈ సినిమాలో చూశామని పేర్కొంటున్నారు. బ్రో సినిమాలో పవన్ కల్యాణ్ కూలీ గెటప్ లో చేతికి లేబర్ లైసెన్స్ బిళ్ల తగిలించుకున్నాడు.
దీంతో ప్రేక్షకులు ఆ బిళ్లను పరిశీలనగా చూస్తున్నారు. అది జనసేన పార్టీ గుర్తు కావడం గమనార్హం. దాన్ని తయారు చేసింది తెనాలికి చెందిన స్వర్ణకారుడు సోమరౌతు బ్రహ్మం, అనురాధ. అందులో జనసేన గుర్తు వచ్చేలా తయారు చేశారు. ఇలా వారికి ప్రచారం కల్పించారు. భీమ్లానాయక్ లో కూడా మొగిలయ్య అనే జానపద కళాకారుడిని వెలుగులోకి తీసుకొచ్చాడు.
ఇలా పవన్ కల్యాణ్ తన సినిమాల్లో కళాకారులకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్రోలో పవన్ కల్యాణ్ ధరించిన ఆ బిళ్లనే అందరు చూస్తున్నారు. పవన్ కల్యాణ్ తన సినిమాల్లో ఏదో ఒక వెరైటీ ఉండేలా ప్లాన్ చేసుకోవడం సహజమే. ఇప్పుడు ఈ సినిమాలో ఇలా బిళ్లతో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. బ్రో సినిమా సూపర్ గా ఉందని ప్రేక్షకుల టాక్.