24 C
India
Saturday, September 12, 2026
More

    భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవద్దు.. వధువు తండ్రి కండీషన్.. ఖంగుతిన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్..

    Date:

     

    పెళ్లంటే ఏడేడు జన్మలం బంధం ఏడు జన్మల సంబంధం. రెండు వ్యక్తిత్వాలు, ఇద్దరు ఒక్కటై కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడమే. కానీ రాను రాను పెళ్లి తంతులో వింతపోకడలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వరుడు తరుఫు వారు, లేదా వరుడు వధువు తరుఫు వారికి కండీషన్లు పెడతారు. ఇది కామనే, కానీ ఇక్కడ వరుడి మామ కోరికలను విన్న అల్లుడు ఈ పెళ్లి ఎందుకురా బాబూ..? అంటూ పెళ్లి మండపం నుంచే పరారయ్యాడు. విచిత్రమైన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. దీనిపై నెటిజన్లు కూడా అంతే డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ఆ కథేంటో చూద్దాం.

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఝాన్సీ జిల్లాలో ఒక పెళ్లి వేడుక మొదలైంది. బంధువులు, కుంటుంబ సభ్యులతో వేదిక మొత్తం సందడిగా ఉంది. ఇక తాళి కట్టే సమయానికి వధువు తండ్రి, వరుడి మామ మండపంలోకి వచ్చాడు. తన కూతురును కన్యాదానం చేసేందుకని అందరూ అనుకున్నారు కానీ ఇక్కడ జరిగింది మాత్రం మరోటి. వరుడికి మూడు కండీషన్లు పెట్టాడట. అట్లయితేనే పెళ్లి చేసుకోమన్నాడట. ఆవేంటంటే..

    1. పెళ్లి కొడుకు తన కూతురితో శారీరక సంబంధం పెట్టుకోకూడదట.
    2. పెళ్లి కూతురు తన చెల్లిని (మామ రెండో బిడ్డ) అక్కతో పాటు అత్తారింటికి తీసుకెళ్లాలి. అక్కడ అక్కా, చెల్లెల్లు (తన ఇద్దరు కూతుళ్ల) ఒకే గదిలో ఉండేలా చూడాలి.
    3. అల్లుడి ఇంటికి ఎప్పుడు ఏ సందర్భంలో వెళ్లినా అడ్డు చెప్పవద్దు అంటూ కండీషన్లు పెట్టాడట.

    ఇది విన్న వరుడి గుండె బరువెక్కిపోయిందట. అక్కా చెల్లెల్లు ఒకే గదిలో పడుకోవడం శోభనం ముహూర్తం పెట్టే వరకు ఒకే.. ఆ తర్వాత అంటే ఎలా..? ఇక అల్లుడి ఇంటికి (కూతురు ఇల్లు కూడా) ఎప్పుడైనా వెళ్లచ్చు ఇది కూడా సరైన కోరికే.. కానీ తాళి కట్టిన తన భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవద్దని చెప్పడం ఏంటని వరుడి కుటుంబ సభ్యులు నిలదీశారట. ఈ పెళ్లి నాకు వద్దు బాబోయ్ అంటూ వరుడు వెళ్లిపోయాడట. దీనిపై నెటిజన్లు డిఫరెంట్ గా కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Age of 35 ఏళ్లు దాటితే సంతానం పొందడం కష్టమే!

    Age of 35 : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది...

    CIBIL score : వరుడి CIBIL స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు!

    CIBIL score : డబ్బు వైపు పరుగెడుతున్న నేటి సమాజంలో అనూహ్య సంఘటన...

    Marriage with rice cooker : రైస్ కుక్కర్ తో పెళ్లి.. నాలుగు రోజులకే విడాకులు

    Marriage with rice cooker After Divorce : ప్రస్తుతం సోషల్...