28.3 C
India
Monday, July 1, 2024
More

    AS Rao Nagar : హైదరాబాద్ లో ‘AS Rao నగర్’ అందరికీ తెలుసు..కానీ ఆయన గురించి ఎందరికి తెలుసు?

    Date:

    AS Rao Nagar
    Dr. AS Rao

    AS Rao Nagar : బహుశా 2000వ సంవత్సరం అనుకుంటా.. ఒక పెద్దాయన హైదరాబాద్ సిటీ బస్సులో టికెట్ కొనుక్కొంటూ కండక్టర్ తో  ‘‘AS రావు నగర్ వస్తే చెప్పండి’’ అన్నాడు. కాసేపయ్యాక బస్ ఆగితే ఆయన కండక్టర్ తో ‘‘ఇది AS రావు నగరేనా? ’’ అని అడిగితే అపుడు కండక్టర్ విసుగ్గా ‘‘ఏమయ్యా.. నీకు AS రావు నగర్ ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో తెలియదా?’’ అన్నాడు.

    అపుడు పక్క సీట్లో వున్న మరో వ్యక్తి కండక్టర్ తో ‘‘ ఆయనే A. S. రావు గారు’’ అన్నపుడు  కండక్టర్ తో పాటు అది విన్న ఇతర ప్యాసెంజర్లు కూడా ఆశ్చర్యపోయారుట. అంత నిరాడంబరత AS Rao గారిది. ఆయనకు 1960 లో పద్మశ్రీ, 1974లోనే పద్మభూషణ్ అవార్డులు వెతుక్కొంటూ వచ్చాయి.  అంతగొప్ప వ్యక్తి అయిన ఆయన కారు కూడా వాడేవాడు కాదు. ‘ఎందుకండీ, ఇంకా చేతనౌతుంది, నడచి పోవచ్చు. చాలా దూరం అనుకోండి సిటీ బస్సులు వున్నాయి కదా!’’ అనేవారు ఆయన.

    AS Raoగా పూర్తిపేరు అయ్యగారి సాంబశివ రావు. ఆయన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వ్యవస్థాపకుడు. ఏస్ఆర్ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్లు గ్రామంలో వెంకటాచలం, సుందరమ్మ దంపతులకు 20 సెప్టెంబర్ 1914న ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక, మాధ్యమిక విద్య చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఆయన తల్లి, ఆమె పెళ్లప్పుడు అమ్మ నాన్నలు పెట్టిన ఒక చీర ను పాత గుడ్డలు కొనుక్కొనేవారికి అమ్మి, ఆ డబ్బును రావు గారికి ఇచ్చిందట. అది కూడా ఎంతో తెలుసా? కేవలం 2 రూపాయలు!

    అప్పులు చేసి, పస్తులుండి చదువే ఆయుధంగా ముందుకు నడచి రావు గారు కాశీ లోని ప్రఖ్యాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ లో చేరారు. హాస్టల్ సౌకర్యం దొరక్కపొతే, వాళ్లను వీళ్లను పావలా, అర్ధరూపాయ అడుక్కోంటూ 8 రూపాయలు అయితే దానితో రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసి ఎంఎస్సీ పూర్తి చేశారు.  ఆ తర్వాత ఆరేళ్లపాటు ఆ యూనివర్సిటీలో బోధించి పలు పరిశోధనలు నిర్వహించారు.

    ఆ తర్వాత అమెరికా (కాలిఫోర్నియా)లోని Stanford University లో Masters చేయాలని రావు గారి కోరిక. పేదరికం వెక్కిరించింది. కానీ ఆయన ప్రతిభ ఎవరినో ఆకర్షించింది. ఎవరు వారు? TATA సంస్థ.  40 000 రూపాయలను ఆయనకు స్కాలర్ షిప్ గా ఇచ్చి Stanford University కి పంపింది.

    ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత  రూ. 150000 జీతంతో స్టాన్‌ఫోర్డ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసేందుకు పెద్ద జీతం ఆఫర్ చేశారు. కానీ రావు గారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, ” క్షమించాలి. నేను నా మాతృదేశం ఋణం తీర్చుకోవాలి, నన్ను ఇక్కడికి పంపిన టాటా సంస్థ కు నా సేవలు అందించాలి, ” అన్నారట. భారత్ తిరిగిచ్చాక టాటా వాళ్లు Tata Institute of Fundamental Research (TIFR ) Mumbai లో ఉద్యోగం ఇచ్చారు. అపుడు ఆయన జీతం కేవలం రూ.300 మాత్రమే. ఇది ఆయన కృతజ్ఞతను తెలియజేస్తుంది.

    మనకు డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, ప్రతిష్ట పిచ్చి, సుఖాల పిచ్చి . కానీ ఆయనకు దేశమంటే పిచ్చి, కర్తవ్యం అంటే పిచ్చి, కృతఙ్ఞత అంటే పిచ్చి, నైతిక విలువలంటే పిచ్చి. ముంబై లో ఏఎస్ ఆర్ పరిశోధనలు ఏ స్థాయిలో వుండేవంటే సాక్షాత్తూ Father of Indian Nuclear Programme అని పిలవబడిన హోమీ జే బాబా తానే స్వయంగా ముంబై వెళ్లి ఆయనను అభినందించారట. తరువాతి రోజుల్లో ఆయన ఎన్నో విభాగాల్లో దేశానికి, సైన్స్ టెక్నాలజీ రంగాల్లో సేవలు అందించారు.

    2003 లో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రి లో చేరినప్పుడు ఒక డాక్టర్ ఆయనకు ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్ అమరుస్తుండగా ఆయన ఇక కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతారని తెలిసి కూడా నాకు ట్రీట్మెంట్ ఇచ్చి పైకి లేచేటప్పుడు జాగ్రత్త, పైన వున్న మానిటర్ నీ తలకు తగిలే ప్రమాదముందన్నారట.  చివరి శ్వాస వరకూ ఇతరుల కష్టం, ఇతరుల బాధ తనవిగా భావించే మానవత్వం ఆయనది. ఈసారి హైదరాబాద్ లోని ఏఎస్ఆర్ నగర్ వెళితే ఆ మహనీయుడిని ఒక్క సారి  గుర్తు చేసుకోండి.

    Share post:

    More like this
    Related

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది...

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ...

    CM Chandrababu : వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    CM Chandrababu : ఏపీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related