24.7 C
India
Sunday, June 23, 2024
More

    Furniture Thief Jagan : ‘‘ఫర్నీచర్ దొంగ దొరికిపోయాడు’’.. జగన్ ను ఆడుకుంటున్న సోషల్ మీడియా

    Date:

    Furniture Thief
    Furniture Thief Jagan

    Furniture Thief Jagan: ఏపీలో కొత్త రాజకీయానికి తెర లేచింది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్ తో నింపేశాడన్న ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తన సోషల్ మీడియా లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. “ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడు” అంటూ హైలెట్ చేసింది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్ కి ప్రజల సొమ్ము మీద ఇంకా మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్ తో నింపాడు. పదవి పోయాక రూ.39 లక్షల విలువైన ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కానీ ఆయన ఇవ్వలేదు. ఇక ఇలాంటి వాడిని ఏమని అనాలి అంటూ జగన్ తాడేపల్లి క్యాంపు ఆఫీసు ఫొటోలను పోస్ట్ చేశారు. నిన్న పార్టీ నేతలతో తాడేపల్లి క్యాంపు ఆఫీసులో జగన్ సమావేశం ఏర్పాటు చేసిన ఫొటోలను వైసీపీ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది. పార్టీ నేతలకు జగనన్న ఆత్మ స్తైర్యాన్ని నింపుతున్నారంటూ గర్వంతో పోస్టు చేసిన ఈ ఫోటోనే జగన్ ను ప్రజల ముందు ‘దొంగ’గా నిలబెట్టింది. బహుశా వైసీపీ నేతలు ఇంత రచ్చకు దారి తీస్తుందని గ్రహించి ఉండకపోవచ్చు.

    అధికారంలో ఉన్నప్పుడు తానూ చేసిన పాపాలు తిరిగి తనకే తగులుతాయని ఊహించని జగన్ ఇప్పుడు ఈ ఫర్నిచర్ దొంగ అనే నిందను మోయాల్సి వచ్చింది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అప్పటి మాజీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ పై ఫర్నిచర్ దొంగ అంటూ నిందలు మోపి.. తన రాజకీయ జీవితంలో చెరుపుకోలేని ముద్ర వేసుకున్నారు జగన్. ఆ అవమాన భారం మోయలేక మానసిక క్షోభతో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే  ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. జగన్ కు చేసిన పాపం నీడలా వెంటాడిందా అన్నట్లుగా వైసీపీ అధికారం కోల్పోయిన ‘మూడు వారాలకే’ జగన్ అదే ‘ఫర్నిచర్ దొంగ’ అనే నిందను మోయాల్సి వచ్చింది. దీనితో కోడెల అభిమానులు  జగన్ కు  కాలం మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది, కోడెల ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందని అంటున్నారు. ఈ రోజు టీడీపీ పెట్టిన పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ “ఫర్నిచర్ దొంగ”.. ఈ మాట ఎక్కడో విన్నట్లుంది కదా అంటూ టీడీపీ, జనసేన మద్దతుదారులు అటు జగన్ ను ఇటు వైసీపీ ని ట్రోల్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Jagan : అసెంబ్లీకి జగన్ వస్తే కచ్చితంగా గౌరవం ఇస్తాం !

    Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా...

    Chandrababu : పవన్ ను అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు.. ఇప్పుడు 21 సీట్లు గెలిచారు

    Chandrababu : ‘పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం....

    Virat Kohli : ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. భారత కోచ్ సంచలన వ్యాఖ్యలు

    Virat Kohli : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్...

    CM Revanth Reddy : చంద్రబాబుతో పోటీ తథ్యం.. రేవంత్ రెడ్డి..

    Telangana CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఎన్నికైన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ex CM Jagan : అసెంబ్లీలో జగన్ కు ర్యాగింగ్ మొదలు.. ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం ఏం చేశారంటే?

    Ex CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏ...

    Deputy CM Pawan Kalyan : అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

    Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  సమావేశాలు నేడు...

    IAS – IPS officers : ఐఏఎస్, ఐపీఎస్‌లకు జగన్ పాలన ఒక గుణ పాఠమేనా?

    IAS - IPS officers : ప్రభుత్వం, అధికారం.. ఒకే దారంతో...

    Ex CM Jagan : మాజీ సీఎం వారానికోసారి కోర్ట్ కు వెళ్లాల్సిందేనా ???

    Ex CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య...