35.3 C
India
Wednesday, May 15, 2024
More

    Ganesh Utsavs : పిల్లలను వినాయకున్ని పెట్టనివ్వండి. ఎందుకంటే..

    Date:

    Ganesh Utsavs : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఊరికే పుట్టలేదు. ఎందుకంటే అవి మన బలాన్ని నిరూపిస్తాయి.. బాధ్యతను గుర్తు చేస్తాయి. సమూహంగా పోరాడాల్సిన ఆవశ్యకతను చాటిచెబుతాయి. నిజానికి గణేష్ నవరాత్రులు ఉండేవి కావు. బ్రిటీష్ వారి కాలంలో జనాలను ఏకం చేయాలని.. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయించాలని ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టింది స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన ‘లోకమాన్య బాల గంగాధర్ తిలక్’.

    బ్రిటీష్ వారి కాలంలో వినాయక చవితిని ఎవరి ఇంట్లో వాళ్లు పూజలా జరుపుకునేవారు. ఎలాంటి ఆర్భాటం, సందడి లేకుండా సాధారణంగా జరిగిపోయేది. కానీ 1894 నుంచే బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలు, సందడి మొదలైంది. దీనికి కారణం స్వాతంత్ర్య ఉద్యమం. 1894 సమయంలో రాజకీయ సంబంధిత ఎలాంటి ర్యాలీలకు కానీ ప్రదర్శనలకు కానీ బ్రిటీషప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకునేది.

    ఎలాంటి మీటింగ్, బహిరంగ ప్రదర్శనలు లేకపోవడంతో ప్రజల్లో ఐకమత్యం, స్వాతంత్ర కాంక్ష మెల్లగా తగ్గిపోతుందని తిలక్ భావించారు. ప్రజలందర్నీ ఏకం చేయడానికి వినాయక చవితిని తిలక్ ఓ సాధనంగా గుర్తించారు. కుల, వర్గ భేదాలు లేకుండా అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ పండుగను సరైన మార్గంగా భావించారు. అప్పుడే తొలిసారి పూణేలో బహిరంగ ప్రదేశాల్లో భారీగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రజలందర్నీ పదిరోజుల ఉత్సవాల్లో భాగం చేశారు. భక్తి శ్రద్ధలతో భారీ ఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరిలోనూ యూనిటీ కనిపించింది. సో ఈ రకంగా వినాయక చవితి అనే దేవుడి సెంటిమెంట్ ఆధారంగా స్వాతంత్ర్యం కోసం ప్రజలను తిలక్ ఉత్తేజితులను చేశారు. బానిస సంకెళ్ల నుంచి పోరాడేందుకు, అందరినీ సమైక్యం చేసేందుకు అప్పట్లో భారతీయులకు దొరికిన ఓ మార్గం వినాయక చవితి.

    వినాయక చవితి కేవలం భక్తి, స్వాతంత్ర్య కాంక్ష మాత్రమే కాదు.. పిల్లల్లో ఈ కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరగడానికి కారణం అవుతుంది. పిల్లలను వినాయకున్ని పెట్టనివ్వండి. ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉంటాయి. వారి నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి.

    🔱 చందాలు అడగటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి..
    🔱 షెడ్డు వేయడం వల్ల ఇంజినీరింగ్ స్కిల్స్ పెరుగుతాయి..
    🔱 వచ్చిన డబ్బులను సరిపోయే విధంగా ఖర్చు చేయడం వల్ల మనీ మేనేజ్మెంట్ తెలుస్తుంది.
    🔱 కరెంట్ గురించి, DJ బాక్స్ ల గురించి తెలుస్తుంది
    🔱 9 రోజులు కలిసి ఉండటం వల్ల తమ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనే విషయం తెలుస్తుంది.
    🔱 9 రోజులు పూజ చేయటం వల్ల మన పూజా విధానం,మన సంస్కృతి సాంప్రదాయం మన ధర్మం గురుంచి తెలుస్తుంది.
    🔱 భగవంతుని పైన నమ్మకం పెరగడం వల్ల భవిష్యత్తు లో తప్పు చేయడానికి భయపడి క్రమశిక్షణతో పెరుగుతారు.
    🔱 మరెన్నో ఉపయోగాలున్నాయి.
    🔱 ముఖ్యంగా భవిష్యత్ హిందూ జాతి సంరక్షకులుగా ఉంటారు.
    🔱 మీరు ఇచ్చే రూపాయలు అవి 100 కానీ 1000 గాని ఇయ్యలేక వాళ్లను వద్దంటే ఇన్ని రకాల ప్రయోజనాలకు దూరం అవుతారు.
    కావున పిల్లలు చందాకు వస్తే తోచినంత సహాయం ఇవ్వండి ఇది మన బాధ్యత.

    Share post:

    More like this
    Related

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Smartphones Effects On Children : చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్న స్మార్ట్ ఫోన్లు

    Smartphones Effects On Children : ఇటీవల కాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు...

    Children Phone Addiction : చిన్నపిల్లలు మొబైల్ వాడితే నష్టాలేంటో తెలుసా?

    Children Phone Addiction : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరుగుతోంది....

    చిన్నారులే వాడి టార్గెట్.. అర్థరాత్రి కిడ్నాప్ చేసి..

    తాగిన మైకంలో ఆ మానవమృగం ఏం చేస్తుందో తెలియదు. అభం,  శుభం...