Smartphones Effects On Children :
ఇటీవల కాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం పిల్లలు గంటల తరబడి టీవీ చూడటం, సెల్ ఫోన్ వాడటం మంచిది కాదని తేల్చింది. చిన్నారుల్లో మానసిక ఎదుగుదలపై ప్రభావం పెడుతుంది. వారి మానసిక స్థితి సరిగా ఉండకుండా పోవడానికి కారణమవుతుంది.
చిన్నతనంలో వచ్చే అనారోగ్య సమస్యలకు స్మార్ట్ ఫోన్లే ప్రధాన కారకంగా మారుతున్నాయి. ఐదేళ్ల లోపు చిన్నారులు రోజులో ఒక గంట కంటే ఎక్కువ సేపు ఫోన్ చూడటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రేడియేషన్ ప్రభావం వల్ల పిల్లలపై నెగెటివ్ ప్రభావం చూపతుందని అంటున్నారు. ఈనేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
పదేపదే స్మార్ట్ ఫోన్లు చూడటం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎక్కువ సమయం ఫోన్లు వాడుతూ బానిసలుగా మారుతున్నారు. చిన్నారుల మానసిక ప్రవర్తనలో భయంకరమైన మార్పులు రావడం ఖాయం. ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. ఫోన్ల వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
స్మార్ట్ ఫోన్ల వినియోగం వల్ల వచ్చే సమస్యల వల్ల కలిగే దుష్స్రభావాలు ఏర్పడతాయి. చిన్నపిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచకపోతే భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు వాడితే కలిగే నష్టాల గురించి అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ల వల్ల ఏర్పడే వచ్చే సమస్యలను గుర్తించి వాటికి దూరం కావడమే మనం చేయల్సిన పని అని తెలుసుకుని ప్రవర్తిస్తే చాలు.