villagers punished the children :
చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు, సమాజం జాగరూకతతో ఉండాలి. చిన్న తనంలో తమ మనసుపై పడిన ముద్ర జీవితాంతం ఉంటుంది. అందుకే వారిని విచారించేందుకు సపరేట్ కోర్టులు, వారి కోసం సపరేట్ జైల్లు ఇవన్నీ ఉన్నాయి. సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలంటే చిన్న తనంలోనే బీజం పడాలి. ఆ ఏజ్ లో ఏదైనా సమస్యలు తలెత్తితే మాత్రం ఆ చిన్నారి పెద్ద సైకోగానో.. సమాజానికి కంఠకంగానో మారుతాడని సైకాలజిస్ట్ లు చెప్తుంటారు. వారి మనసుపై ఎలాంటి ముద్ర పడకుండా చూసుకోవాల్సింది మాత్రం మొదట తల్లిదండ్రులు, తర్వాత సమాజం.
చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ ఎలా తప్పు? దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది పెద్దలు వివరించి చెప్పాలే తప్ప వారిని నేరుగా శిక్షకు గురిచేయవద్దు. అది తప్పు అనే విషయం వారికి కూడా తెలియకపోవచ్చు. ఎదిగే కొద్ది మనం జ్ఞానం పెంచుకుంటాం. కానీ పుట్టినప్పటి నుంచే జ్ఞానం రాదు. ఈ చిన్న విషయాన్ని పెద్దలు గ్రహిస్తే చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ సమాజానికి మంచి పౌరులను అందించగలుగుతారు.
జార్ఖండ్ రాష్ట్రంలో సాహిబ్ గంజ్ లో ఒక ఘటన జరిగింది. దీనిపై దాదాపు దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఇంట్లో ఇద్దరు చిన్నారులు రూ. 5000 దొంగలిస్తూ దొరికిపోయారు. దీంతో ఆ గ్రామస్తులు వారికి విపరీతమైన శిక్షను విధించారు. ఆ ఇద్దరు చిన్నారులకు గుండు గీయించి, మెడలో చెప్పుల దండ వేసి బురద గుంటలో 4 గంటల పాటు నిల్చుండబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న లోకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషయంపై దేశం తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి శిక్షలు పసి హృదయాలను తీవ్రంగా కలిచి వేస్తాయని చెప్తూనే. ఇలాంటి శిక్ష వేసిన వారికి మరింత కఠినమైన శిక్ష విధించాలని కామెంట్లు పెడుతున్నారు.