Guntur Karam : సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ రెండు సినిమాలు రాగా అవి బాక్సాఫీస్ హిట్ అయ్యాయి. వీరి కాంబోలో వచ్చిన ‘ఒక్కడు’, ‘ఖలేజా’ ఈ రెండు సినిమాలకు ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే సందేహం లేదు. ఈ కాంబోలోనే వస్తున్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలో దీన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘గుంటూరు కారం’కు సంబంధించి గతంలో టీజర్ రిలీజ్ కావడంతో హ్యూజ్ వ్యూవ్స్ దక్కించుకుంది.
సూపర్ స్టార్ మహేశ్ గతంలో ఒక్కడు, ఖలేజా చిత్రాలను అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మూడోసారి సినిమా చేస్తున్నారు. ‘గుంటూరు కారం’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్స్ పలుమార్లు వాయిదా పడడం, డేట్స్ లేకపోవడం, హీరోయిన్ల మార్పుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. 2024 సంక్రాంతికి ముందు వరుసలో ఉన్న ఈ సినిమా ఆగిపోతుందనే టాక్ ఎప్పటి నుంచో ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ‘గుంటూరు కారం’ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మహేశ్ బాబుతో పాటు ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. అక్టోబర్ నెలాఖరుకు సినిమా టాకీ పార్ట్ చాలా వరకు పూర్తవుతుందని, నవంబర్ లో పాటలు, డిసెంబర్ లో కొంత యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తారని సమాచారం.
ఇప్పటికే థమన్ ఇచ్చిన రెండు పాటలు వీనుల విందుగా ఉన్నాయని, త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేయాలని మహేశ్ బాబు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతానికి ఈ సినిమాను 2024 సంక్రాంతికి తీసుకొస్తామని మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
బిజినెస్, బాక్సాఫీస్ పరంగా చూస్తే కల్కి 2898AD, సలార్, #మెగా156 ఇలా చాలా మంది హీరోలు సంక్రాంతి రేసులో లేరని టాక్ ఉంది. ఈ నేపథ్యలో ఈ సినిమానే నిలుస్తుందని అనుకుంటున్నారు. రవితేజ ‘ఈగిల్’, ప్రశాంత్ వర్మ ‘హను మాన్’ మాత్రమే ఈ ఏడాది సంక్రాంతికి పోటీ పడుతున్నాయి.